British MP Virendra Sharma | మీ స్ఫూర్తి అద్భుతం.. మిమ్మల్ని కలవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. కేసీఆర్‌పై బ్రిటిష్ ఎంపీ వీరేంద్రశర్మ ప్రశంసలు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సామాజిక సమానత్వ దార్శనికత దేశ విదేశాల మేధావులు, సీనియర్ రాజకీయ వేత్తల ప్రశంసలు అందుకొంటున్నది. భారతదేశం గర్వించే రీతిలో డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని ఇటీవలే హైదరాబాద్ నడిబొడ్డున ఆవిషరించటంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మహా విగ్రహావిష్కరణ ప్రాధాన్యం సంతరించుకొంటున్నది.
- అంబేద్కర్ విగ్రహం తెలంగాణకే గర్వకారణం
- బాబాసాహెబ్ ఆలోచనలు మహోన్నతం
- బ్రిటన్‌లో తెలంగాణ సంస్థలతో పనిచేస్తున్నాం
- అంబేద్కర్ విగ్రహ స్థాపనను ప్రశంసిస్తూ లేఖ
British MP Virendra Sharma | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సామాజిక సమానత్వ దార్శనికత దేశ విదేశాల మేధావులు, సీనియర్ రాజకీయ వేత్తల ప్రశంసలు అందుకొంటున్నది. భారతదేశం గర్వించే రీతిలో డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని ఇటీవలే హైదరాబాద్ నడిబొడ్డున ఆవిషరించటంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మహా విగ్రహావిష్కరణ ప్రాధాన్యం సంతరించుకొంటున్నది. తాజాగా సీఎం కేసీఆర్ మహోన్నత దార్శనికతను కొనియాడుతూ బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) వీరేంద్ర శర్మ స్వయంగా లేఖ రాశారు. యూకేలోని సౌతాల్‌లో ఉన్న ఈలింగ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. బ్రిటిష్ ఇండియన్ సంతతికి చెందిన 76 ఏండ్ల సీనియర్ రాజకీయ నాయకుడు వీరేంద్ర శర్మ ఈ మెయిల్ ద్వారా సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి
డాక్టర్ బీఆర్ అంబేదర్ మహా విగ్రహాన్ని నిర్మించి ఆవిషరించడం గొప్ప విషయం. ఇది తెలంగాణ రాష్ట్రానికి, మీకు కూడా గర్వకారణం. మీ స్ఫూర్తి అద్భుతం. డాక్టర్ అంబేదర్ పుట్టుక, వారు చేసిన కృషి, వారి చరిత్రే భారతదేశ చరిత్ర. ఇటు యూకే, అటు ఇండియాలోనూ నాటి పరిస్థితుల్లో అంబేదర్ ప్రదర్శించిన సహనం, సమానత్వం కోసం పట్టుదల, ఆలోచనలు, కార్యాచరణ, విరామమెరుగని రచనా వ్యాసంగం మహోన్నతమైనవి. కాలం చెల్లిన సంప్రదాయ మూస ధోరణులను పకకుతోసి, ఎటువంటి వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల సమానత్వంతో కూడిన సమ్మిళితాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, బహుళత్వం దిశగా సమాజాన్ని నడిపించేందుకు నవీన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేదర్ రూపొందించించారు. రాజ్యాంగ నిర్మాతగా, పితామహుడుగా భారతదేశ పురోగమనానికి కొనసాగింపుగానే వారు రాజ్యాంగ్యాన్ని నిర్మించారు. భవిష్యత్తు తరాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ ప్రదర్శించిన దార్శనికతను మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. యూకేలోని తెలంగాణకు చెందిన సామాజిక సంస్థలతో కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నాను. త్వరలో మిమ్మల్ని బ్రిటన్‌లో కలిసేందుకు ఎదురుచూస్తున్నాను. అంబేద్కర్ విగ్రహం తయారీ, నేపథ్యం, ఆవిష్కరణపై మీ అనుభవసారాన్ని తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.
ఎవరీ వీరేంద్రశర్మ
వీరేంద్రశర్మ 1947 ఏప్రిల్ 5న పంజాబ్‌లోని మంధానీలో జన్మించారు. 1968లో బ్రిటన్ వలస వెళ్లిన ఆయన, జీవనభృతి కోసం అకడ బస్ కండక్టర్‌గా ఉద్యోగం కూడా చేశారు. లండన్ సూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. 2007లో ఈలింగ్ నుంచి ఎంపీగా గెలిచి, ఇప్పటికీ అదే స్థానం నుంచి హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. లేబర్ పార్టీలో జాతి సమానత్వ విభాగానికి జాతీయ నాయకుడిగా పనిచేశారు. 1982 నుంచి 2010 వరకు లండన్ బరో ఆఫ్ ఈలింగ్ కౌన్సిలర్‌గా పనిచేశారు. అక్కడే మేయర్‌గా కూడా సేవలందించారు. అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


