అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యకు యత్నించాడు. ఫోన్ లోకేషన్ ద్వారా గుర్తించిన పోలీసులు.. చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అశ్వారావుపేట, జూన్ 30: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యకు యత్నించాడు. ఫోన్ లోకేషన్ ద్వారా గుర్తించిన పోలీసులు.. చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వివరాలు ఇలా.. అశ్వారావుపేట పోలీస్ సేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఎస్సై శ్రీను ఆదివారం ఉదయం 8:30 గంటలకు మఫ్టీలో స్టేషన్‌కు వచ్చారు. సోమవారం నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. అదే సమయంలో ప్రైవేట్ కారు రావడంతో డ్రైవర్‌ను దింపిన ఎస్సై.. ఇప్పుడే వస్తానంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు.
మధ్యాహ్నం తరువాత సిబ్బంది ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో వెంటనే సీఐ జితేందర్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఎస్సై ఫోన్ లోకేషన్‌ను ట్రాక్ చేయగా మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత మండలంలోని తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారు. కానీ రాత్రి 10:45 గంటల వరకు ఆచూకీ లభ్యం లభించలేదు. ఇంతలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు గుర్తించారు. వెంటనే అక్కడి ఎస్సై అరుణ స్పందించి చికిత్స కోసం అక్కడి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎస్సై శ్రీను ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

