యాంటీ ర్యాగింగ్@ 1800-180-1522
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం బారిన పడ్డారా..? కాలేజీకి వెళ్లాలంటేనే భయమేస్తున్నదా? అయితే ర్యాగింగ్ రక్కసి బాధిత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో 1800-180-1522 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉన్నది.
- 24 గంటల పాటు హెల్ప్‌లైన్
- ర్యాగింగ్‌ను నిరోధించేందుకు పటిష్ఠ నిబంధనలు
- విద్యాసంస్థల్లో ఆత్మహత్య ఘటనలపై ప్రిన్సిపాళ్లు, రిజిస్ట్రార్లు విచారణకు రావాల్సిందే
- యూజీసీ కీలక ఆదేశాలు జారీ
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం బారిన పడ్డారా..? కాలేజీకి వెళ్లాలంటేనే భయమేస్తున్నదా? అయితే ర్యాగింగ్ రక్కసి బాధిత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో 1800-180-1522 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉన్నది. ఇది 24 గంటల పాటు 365 రోజులు సేవలందిస్తుంది. helpline@antiragging ఈమెయిల్‌కు ఫిర్యాదు చేయొచ్చు. యూజీసీ మానిటరింగ్ సెల్ నంబర్ 0882645580ను కూడా బాధిత విద్యార్థులు సంప్రదించవచ్చు.
2009 సుప్రీంకోర్టు తీర్పు, యూజీసీ 1956 సెక్షన్ 36, సబ్‌సెక్షన్ (1) ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధం. అయినా ఆకతాయిలు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. మూడు నెలల క్రితం గాంధీ మెడికల్ కాలేజీ, కాకతీయ మెడికల్ కాలేజీ, మహబూబాబాద్ మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు వెలుగుచూశాయి. అడపాదడపా పలు విద్యాసంస్థల్లో కూడా ర్యాగింగ్ కనపడుతున్నది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక ఆదేశాలిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లకు, వర్సిటీల వీసీలకు యూజీసీ లేఖలు రాసింది. ర్యాగింగ్‌ను క్రిమినల్ చర్యగా పేర్కొన్న యూజీసీ.. దీనిని నిరోధించడానికి పటిష్ఠ నిబంధనలు రూపొందించినట్టు వెల్లడించింది.
యూజీసీ ఆదేశాలు..
- విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీని, యాంటి ర్యాగింగ్ స్కాడ్‌ను, యాంటీ ర్యాగింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలి.
- ర్యాగింగ్ శృతిమించి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొంటే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్, వర్సిటీ రిజిస్ట్రార్లను విచారణకు పిలుస్తారు. వీరు నేషనల్ యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
- విద్యాసంస్థలు, హాస్టళ్లలో, ప్రముఖ ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటుచేయాలి.
- విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించాలి.
- యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ ఆదేశాల ప్రకారం జూనియర్లు, సీనియర్ల మధ్య తారతమ్యాన్ని పూడ్చేందుకు మెంటార్షిప్ను ప్రోత్సహించాలి.
- లీగల్ కౌన్సెలింగ్ ఇచ్చి ర్యాగింగ్ నిరోధక చట్టాలు, శిక్షలపై అవగాహన కల్పించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

