చిలుకూరు మృగవని పారులో ప్రాగితిహాసిక ఆనవాళ్లు
హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు మృగవని జాతీయ పారులో బండ జువ్వి వాచ్ టవర్ వద్ద నాలుగు లోతైన గాడులు గుర్తించినట్టు చరిత్రకారుడు డాక్టర్ సత్యనారాయణ ద్యావనపల్లి తెలిపారు. ఒకొకటి సుమారు ఒక అడుగు పొడవు, 2 నుంచి 4 అంగుళాల లోతు కలిగిన ఈ గాడులు ప్రాగితిహాసిక కాలంలో రాతి పనిముట్లను సానబెట్టడానికి ఉపయోగించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
- పురావస్తు సర్వే చేపట్టాలని ద్యావనపల్లి విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 21: హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు మృగవని జాతీయ పారులో బండ జువ్వి వాచ్ టవర్ వద్ద నాలుగు లోతైన గాడులు గుర్తించినట్టు చరిత్రకారుడు డాక్టర్ సత్యనారాయణ ద్యావనపల్లి తెలిపారు. ఒకొకటి సుమారు ఒక అడుగు పొడవు, 2 నుంచి 4 అంగుళాల లోతు కలిగిన ఈ గాడులు ప్రాగితిహాసిక కాలంలో రాతి పనిముట్లను సానబెట్టడానికి ఉపయోగించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలోని లోయలు, నీటి వనరులు, పెద్ద బండరాళ్లతో కూడిన సహజ భౌగోళిక నిర్మాణాలు ప్రాచీన మానవ నివాసాలకు అనుకూలంగా ఉండి ఉండవచ్చని పేరొన్నారు.
ఇకడి నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరంలోని ఫారెస్ట్ ట్రెక్ పారు సమీపంలో పాము పడగను పోలిన శిలపై అనేక కాషాయ వర్ణపు రాతి చిత్రాలు ఉన్నాయని అన్నారు. వాటిలో తాబేలు, మచ్చిక చేసుకున్న జంతువు, వేట దృశ్యాలు, బాణాలు, సరిహద్దు రేఖల నమూనాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ ఆనవాళ్ల కాలం, ప్రాముఖ్యతను నిర్ధారించేందుకు తెలంగాణ పురావస్తుశాఖ, అటవీశాఖ సంయుక్తంగా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని ద్యావనపల్లి విజ్ఞప్తి చేశారు. ఈ పరిశోధన ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేల సంవత్సరాల క్రితమే మానవ సంచారం లేదా నివాసం ఉన్నదనే విషయంపై మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉన్నదని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

