WB Discovery | హైదరాబాద్‌కు వార్నర్ బ్రదర్స్.. అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం
దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా వర్ధిల్లుతున్న హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ వినోద దిగ్గజ సంస్థ రానున్నది. మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేయనున్నది. ఇందులో 1,200 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
- ఐడీసీ ఏర్పాటు తర్వాత తొలి ఏడాదే 1,200 మంది నిపుణులకు ఉద్యోగాలు
- అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధుల సమావేశం
- ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు ఊపు
WB Discovery | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా వర్ధిల్లుతున్న హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ వినోద దిగ్గజ సంస్థ రానున్నది. మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేయనున్నది. ఇందులో 1,200 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
వార్నర్ బ్రదర్స్ సంస్థ టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, గేమింగ్‌లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్లు, ఫ్రాంచైజీలకు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఆర్థిక విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా కార్టర్ బుధవారం న్యూయార్క్‌లో సమావేశమయ్యారు.
మీడియా, వినోద రంగంలో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు కార్టర్ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఐడీసీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కేంద్రం భారత్‌లోని తమ సంస్థ కార్యకలాపాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ ఐడీసీలో మొదటి ఏడాదే సంస్థ 1,200 మంది నిపుణులను నియమించుకోనున్నది. వ్యాపారాభివృద్ధినిబట్టి భవిష్యత్తులో మరింతమందికి ఉద్యోగాలు కల్పించే అవకాశమున్నది.

వ్యవస్థాపక సంవత్సరం 2022ప్రధాన కార్యాలయం : న్యూయార్క్
ఆదాయం 33.8 బిలియన్డాలర్లు (2022)
ఆస్తుల విలువ 134బిలియన్డాలర్లు(2022)
ఉద్యోగుల సంఖ్య 11,000 (2022)
కీలక అధికారులు:సామ్యూల్ డీపియాజ్జా (చైర్మన్), డేవిడ్ జెస్లావ్ (ప్రెసిడెంట్, సీఈవో)
వార్నర్ బ్రోస్ డిస్కవరీకి హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్, సీఎన్ఎన్, టీసీఎల్, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్వర్క్, సినీమాక్స్, పోగో, టూన్కార్ట్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్ తదితర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విభిన్న టెలివిజన్ చానళ్లు ఉన్నాయి. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కేంద్రం ఏర్పాటు నిర్ణయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచ దిగ్గజ సంస్థ తన కార్యకలాపాలను తెలంగాణకు విస్తరించడం ఆనందంగా ఉన్నదని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

