ఎకో భవనాలు!
- గ్రీన్ బిల్డింగ్ విధానంలో ముందడుగు
- ఐజీబీసీ- ఐఐఏల మధ్య ఒప్పందం

హైదరాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ): పర్యావరణానికి హాని కలిగించకుండా సుస్థిరాభివృద్ధికి తోడ్పడే హరిత భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మరో ముందడుగుపడింది. ప్రఖ్యాత సంస్థలు సీఐఐ అనుబంధ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ (ఐఐఏ) ఒప్పందం చేసుకొన్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటంతోపాటు ఆర్కిటెక్చరల్ డిజైన్, ప్లానింగ్‌లో సుస్థిర అభివృద్ధిని సాధించే లక్ష్యంతో ఐజీబీసీ, ఐఐఏ ఒప్పందంచేసుకున్నాయి. ఈ మేరకు ఐజీబీసీ చైర్మన్ వీ సురేశ్, ఐఐఏ జాతీయ అధ్యక్షులు సీఆర్ రాజు ఆదివారం వర్చువల్‌గా ఒప్పంద పత్రాలపై సంతకాలుచేశారు. పర్యావరణ అనుకూల భవనాల నమూనాల రూపకల్పన, ఎనర్జీ, పర్యావరణ నిర్వహణలో కొత్త గ్లోబల్ బెంచ్‌మార్క్‌ను నిర్థారించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఈ సందర్భంగా సురేశ్ పేర్కొన్నారు.
హరిత భవనాల నిర్మాణంలో భారతదేశం తన నాయకత్వస్థానాన్ని ప్రపంచ స్థాయిలో సుస్థిరం చేసుకొనేందుకు వీలు కల్పిస్తుందన్నారు. దేశంలో ఇప్పటివరకు 7.83 బిలియన్ల చదరపు అడుగుల మేర 6,548 గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులను ఐజీబీసీలో నమోదు చేసినట్టు వెల్లడించారు. సీఆర్ రాజు మాట్లాడుతూ ప్రస్తుత సందర్భంలో పర్యావరణానికి హానిచేయని సుస్థిరమైన భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణంలో సుస్థిరాభివృద్ధికి ఈ ఒప్పదం ఉపయోగపడుతుందని ఐజీబీసీ ఇండోర్ చైర్మన్ జితేంద్ర మెహతా వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- IGBC
- IGBC and IIA
- IIA
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

