ఫిరాయింపుల కేసుల విచారణ 8కి వాయిదా
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై గెలుపొందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది.
హైదరాబాద్, జూలై3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై గెలుపొందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ వేసిన వేర్వేరు పిటిషన్లు బుధవారం జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి విచారణ చేసే కేసుల జాబితాలో చేర్చారు.
అయితే అనర్హత పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కోరడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఆ ముగ్గురూ ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌కు ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

