Heart Stroke | బైక్‌పై గుండెపోటుకు గురైన వ్యాపారి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
Heart Stroke | రామడుగు : పని మీద బైక్‌పై బయల్దేరిన ఓ రియల్ ఎస్టేట్ ( Real Estate ) వ్యాపారి ఆకస్మాత్తుగా గుండెపోటు( Heart Stroke )కు గురయ్యాడు. బైక్ మీద నుంచి కిందపడిపోయి, స్పృహ కోల్పోయిన వ్యాపారిని అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు( Patrolling Police ) గుర్తించారు. పెట్రోలింగ్ కారు డ్రైవర్.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వ్యాపారికి సీపీఆర్( CPR ) చేశారు. కాసేపటి తర్వాత వ్యాపారి స్పృహాలోకి రావడంతో అతన్ని 108 అంబులెన్స్( 108 Ambulance ) లో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా( Karimnagar dist )కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్ట కిరణ్ కుమార్ శనివారం ఉదయం పని నిమిత్తం ఇంటి నుంచి బైక్‌పై బయల్దేరాడు. రామడుగు మండలం వైపు వెళ్తున్న సమయంలోనే రాజాజీనగర్ ప్రాథమిక పాఠశాల సమీపంలో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతను బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
అదే సమయంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు.. వ్యాపారిని గమనించి తమ వాహనాన్ని ఆపారు. వ్యాపారి గుండెపోటుకు గురయ్యాడని భావించిన పెట్రోలింగ్ కారు డ్రైవర్ భగవాన్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతనికి సీపీఆర్ చేశారు. కాసేపటికే వ్యాపారికి స్పృహాలోకి రావడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలోకి 108 అంబులెన్స్‌లో తరలించారు. వ్యాపారి ప్రాణాలను కాపాడిన భగవాన్‌పై జిల్లా పోలీసులు, ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, రామడుగు పెట్రోకార్ డ్రైవర్ భగవాన్ ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులకు సీపీఆర్ చేసి వారి ప్రాణాలను కాపాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు