తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
‘వెంకటపతి కొండ’ ఆలయంపై వెలుగుచూసిన కొత్త శాసనం.. కొత్త తెలంగాణ చరిత్ర అధ్యయన బృందం కమిటీ సభ్యుల వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో కొత్త తెలుగు శాసనం వెలుగుచూసింది. తుకుగూడలోని వేంకటేశ్వరాలయ ప్రాంగణంలో కొత్త తెలు గు శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్, ఉపాధ్యక్షులు బీవీ భద్రగిరీశ్, వేముగంటి మురళీకృష్ణ, కార్యవర్గ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి, యాదేశ్వర్ దండేతర్, కావలి చంద్రకాంత్ గుర్తించారు. ఇది 18వ శతాబ్దపు నాటిదిగా తెలిపారు. శాసనంలో పేరొన్నట్టు ఈ గుట్ట పేరు ‘వేంకటపతి కొండ’ అని, గుడిలోని దేవుడు తిరుపతి ప్రసన్న వెంకటాద్రిగా శాసనం చెప్తున్నదని వెల్లడించారు. ఈ శాసనం వికృతినామ సంవత్సర మాఘ శుద్ధ దశమి, గురువారం అంటే ఎఫిమెరిస్ ప్రకారం 1762 ఫిబ్రవరి 4వ తేదీన వేసినట్టు తెలుస్తున్నదని చెప్పారు.
లక్ష్మీకాంతయ్య లక్ష్మీకుమార కేశవయ్య వంశీకులు రామయ్యగారు వేయించిన ధర్మశాసనంగా వెల్లడించారు. శాసనం వివరాలను బృందం అధ్యక్షుడు హరగోపాల్ వివరిస్తూ.. ఇవి 18వ శతాబ్దం నాటివని, అన్నీ అర్థశిల్పాలేనని(ఉల్బణశిల్పాలే) వెల్లడించారు. కల్యాణమంటపం, స్తంభాలు రాష్ట్రకూటశైలిని పోలి ఉన్నాయని చెప్పారు. గుడి ద్వారానికి వైష్ణవ ద్వారపాలకులు కనిపిస్తారని, గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా శ్రీదేవి, పద్మావతులతో వేంకటేశ్వర స్వామివారు ఉన్నట్టు వెల్లడించారు. గుడిబయట 6 అడుగుల వీరభద్రుడి అర్థశిల్పం ఉన్నదని, ఆ శిల్పానికి ఎదురుగా మెట్లదారిలో ఒక రాతిగుండుపై తెలుగు శాసనం ఉన్నదని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ఫుడ్ పాయిజన్ ఘటనపై సుమోటో కేసు.. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆదేశం
అపార్ట్మెంట్ ఎనోవోసీకి 24 మీటర్ల పరిమితి.. ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

