హృదయ విదారకం.. గోడ కూలి అన్నదమ్ముళ్ల దుర్మరణం
Nizamabad | రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ రెండు కుటుంబాలది. వృద్ధ వయసులోనూ తాపీ పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్న ఆ అన్నదమ్ముళ్ల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తోడబుట్టిన అన్నదమ్ముళ్లిద్దరూ ప్లాస్టరింగ్ పనులు చేస్తూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో, ఆ రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
నిజామాబాద్ : రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ రెండు కుటుంబాలది. వృద్ధ వయసులోనూ తాపీ పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్న ఆ అన్నదమ్ముళ్ల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తోడబుట్టిన అన్నదమ్ముళ్లిద్దరూ ప్లాస్టరింగ్ పనులు చేస్తూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో, ఆ రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు చెందిన అన్నదమ్ముళ్లు గొనుగొప్పుల రాములు(67), గొనుగొప్పుల లింగన్న(65) మేస్త్రీ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే మంగళవారం రోజు ఓ పాత ఇంటి గోడకు ప్లాస్టరింగ్ పనులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో పాత గోడ ప్రమాదవశాత్తు కూలిపోయింది. రాములు, లింగన్న మీద గోడ కూలడంతో తీవ్రంగా గాయపడ్డారు. రాములు అక్కడికక్కడే మృతి చెందగా, లింగన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తోడబుట్టిన అన్నదమ్ముళ్లిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

