‘కొవిడ్’ జర్నలిస్టులకు 5 కోట్లిచ్చాం

- మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఇస్తాం
- రూ.42 కోట్లకు చేరిన జర్నలిస్ట్ సంక్షేమ నిధి
- మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఏ రాష్ట్రంలో లేనివిధంగా కరోనా బారినపడిన జర్నలిస్టులను మీడియా అకాడమీ ఆదుకున్నదని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మీడియా అకాడమీ జర్నలిస్టులకు ఎదురైన కరోనా ఇబ్బందులను కొద్దిమేరకైనా తొలగించడానికి ప్రయత్నించిందని చెప్పారు. ఇప్పటివరకు కరోనా సోకిన జర్నలిస్టులకు రూ.5.15 కోట్లు సాయం అందించిందని వివరించారు. తొలి విడుత కరోనా సమయంలో వైరస్ సోకిన దాదాపు 1,553 మంది జర్నలిస్టులకు రూ.3.106 కోట్లు, కరోనాతో హోంక్వారంటైన్లో ఉన్న 87 మందికి రూ.8.70 లక్షలు అందించామని తెలిపారు. రెండో దశలో దాదాపు 1,958 మంది జర్నలిస్టులకు కరోనా సోకిందని, మలి విడుత ఆర్థికసాయం రూ.10 వేల చొప్పున రూ.1.958 కోట్లు సాయంచేశామని వివరించారు. రెండో విడుత కరోనా చాలా మంది జర్నలిస్టులను బలిగొన్నదని, పేరుగాంచిన జర్నలిస్టులతో సహా దాదాపు 70 మంది మహమ్మారితో అకాల మరణం పొందారని చెప్పారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని మీడియా అకాడమీ నిర్ణయించినట్టు వెల్లడించారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నెలలోపు ఈ రూ.2 లక్షలు ఏక మొత్తంగా అందజేస్తామని, 5 ఏండ్లపాటు నెలకు రూ.3 వేల పెన్షన్ లభిస్తుందని వివరించారు. మరణించిన జర్నలిస్టు కుటుంబంలో 10వ తరగతిలోపు చదువుకొంటున్నవారిలో గరిష్ఠంగా ఇద్దరికి రూ.వెయ్యి చొప్పున ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. రెండు విడుతలు కలిపి మీడియా అకాడమీలో ఉన్న రూ.34.50 కోట్ల కార్పస్ ఫండ్‌పై వచ్చిన వడ్డీని జర్నలిస్టులను ఆదుకోవడానికి వినియోగించామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి రూ.42 కోట్లకు చేరినట్టు అల్లం నారాయణ తెలిపారు. మార్చి 2021 వరకు రూ.34.50 కోట్లతో సంక్షేమ నిధి ఉండేదని, దీనికి అదనంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.7.50 కోట్లు సమకూరినట్టు వివరించారు. మీడియా అకాడమీలో తక్కువ మంది సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం వాట్సాప్ ద్వారా పంపిన 3,600ల కొవిడ్ సహాయ దరఖాస్తులను పరిష్కరించామని పేర్కొన్నారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..
కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ,
ఇంటి నం.10-2-1,సమాచార భవన్,
2వ అంతస్తు, ఏసీ గార్డ్స్, మాసాబ్ ట్యాంక్,
తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

