447 కిలోమీటర్ల ఎవెన్యూ ప్లాంటేషన్

- రోడ్లకు ఇరువైపులా 10 లక్షల మొక్కలు
- నగరాలు, పట్టణాల్లో పచ్చదనం కనువిందు
- లక్ష్యాన్ని దాటేసిన 10 జిల్లాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పట్టణాలు, నగరాల్లో మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ (ఎంఎల్ఏపీ) కార్యక్రమంలో భాగంగా 447 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటా రు. పది జిల్లాలు ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యాన్ని దాటి ముందు కు సాగుతున్నాయి. తెలంగాణకు హరితహారంలో మొక్కలు నాటడమే కాకుండా రోడ్లకు ఇరువైపులా బహుళ వరుసల మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందులో రంగురంగుల పూలమొక్కలు, గుబురు మొక్కలు ఉండేలా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌శాఖ అధికారులు రోడ్లకు ఇరువైపులా బహుళ వరుసలో మొక్కలు నాటేందుకు అనువైన 521 ప్రాంతాలను గుర్తించారు. వీటిల్లో 818 కిలోమీటర్ల మేర మొక్కలు నాటవచ్చని అంచనా వేశారు. ఇప్పటివరకు 325 ప్రాంతాల్లో 447 కిలోమీటర్లలో 10.22 లక్షల మొక్కలను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్ష్యంలో 55 శాతాన్ని అధికారులు చేరుకున్నారు. రెండేండ్లల్లోనే రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెరిగి ప్రజలకు కనువిందు చేయనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- greenary
- Plantation
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

