అన్ని ‘సెట్’ల దరఖాస్తు గడువు పెంపు!

- అపరాధ రుసుములులేకుండా రెండు వారాలు
- ఫైన్ 50% తగ్గించిన
- ఉన్నత విద్యామండలి
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యార్థులపై భారంమోపకుండా ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును రెండు వారాలపాటు పొడిగించాలని నిశ్చయించింది. ఈ మేరకు సెట్ కన్వీనర్లకు స్వేచ్ఛను ఇస్తూ ఇటీవలే ఆదేశాలు జారీచేసింది. రెండు వారాల తర్వాత అపరాధ రుసుముతో దరఖాస్తులను స్వీకరించాలని సూచించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈసెట్) దరఖాస్తుల స్వీకరణను ఇప్పటివరకు రెండుసార్లు పొడిగించారు. మిగతా సెట్లకు సైతం ఇదే తరహా విధానాన్ని అమలుచేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఎం సెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, పీఈసెట్, లా సెట్, పీజీఎల్సెట్, ఎడ్సెట్ ప్రవేశ పరీక్షల అపరాధ రుసుము 50 శాతం తగ్గించారు. గతంలో రూ. 500, వెయ్యి, రూ.2 వేలుగా ఉన్న అపరాధ రుసుములను రూ.250, రూ.500, రూ.వెయ్యికి తగ్గించారు. ఎంసెట్ సహా మరికొన్ని ప్రవేశ పరీక్షలకు తత్కాల్ స్కీం కింద రూ.10 వేలుగా ఉన్న అపరాధ రుసుమును రూ.5 వేలకు తగ్గించారు.
పీఈసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈసెట్) దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఇప్పటికే ఒక దఫా పొడిగించగా తాజాగా ఈ నెల 22వ తేదీవరకు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వడ్డేపల్లి సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసు ము లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగియగా, కరోనా నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరోసారి పొడిగించామని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- examfees
- sets
- Telangana News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

