చిన్న విగ్రహం ఎందుకు?
వినాయక మంటపంలో గణపతి పెద్ద విగ్రహంతోపాటు చిన్న విగ్రహం కూడా పెడతారు ఎందుకు? వక్ర తుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥
Vinayaka Chavithi | వినాయక మంటపంలో గణపతి పెద్ద విగ్రహంతోపాటు చిన్న విగ్రహం కూడా పెడతారు ఎందుకు?
అని రోజూ మనం గణపతిని ప్రార్థిస్తాం. భారీ శరీరంతో కోటి సూర్యకాంతులను ప్రసరింపజేస్తూ, వంకర తిరిగిన తొండంతో అనుగ్రహించే ఓ దైవమా.. మేం చేసే పనులలో ఎలాంటి ఆటంకాలూ రాకుండా చూడమని వేడుకుంటూ వినాయకుణ్ని స్తుతించే శ్లోకం ఇది. గణాధిపతిని కేవలం వినాయక చవితి నాడే కాకుండా ప్రతి రోజూ షోడశ ఉపచారాలతో విధిగా పూజిస్తుంటారు. నిత్యపూజల్లో, శుభకార్యాల్లో మొదటి పూజ పార్వతీ తనయుడికే చెల్లుతుంది.
ఇక వినాయక చవితి సందర్భంగా వీధివీధినా మంటపాలు నెలకొల్పి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. వినాయకుడి భారీ విగ్రహాలను ఏర్పాటుచేస్తారు. భక్తులంతా ఆ వేడుకల్లో పాలుపంచుకుంటారు. పూజలో భాగంగా వినాయక ఉత్సవమూర్తిని విధిగా షోడశ ఉపచారాలతో అర్చించి అలంకరించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ మంటపంలో ఉన్న భారీ విగ్రహాన్ని పూజించడానికి సౌకర్యంగా ఉండదు.
కాబట్టి, ప్రత్యామ్నాయంగా నిత్యపూజ నిర్వహించడానికి వీలుగా ఒక ఉపమూర్తిని (గణపతి చిన్న విగ్రహాన్ని) కూడా మంటపంలో పెట్టి, ఆవాహనం చేసి పూజించే సంప్రదాయం ఏర్పడింది. ఇది లోకాచారమే కానీ, చిన్న విగ్రహం తప్పనిసరిగా కొలువుదీర్చాలనీ, దానికే పూజలు నిర్వహించాలనే దానికి శాస్త్ర ప్రమాణం లేదు. వినాయకుడి పూజలో భాగంగా పసుపు గణపతిని చేసి పూజించాలని శాస్త్రం చెబుతున్నది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

