ఐనాలు అదిరేలా..
చలువ కళ్లద్దాలు అంటే ఇంతకుముందు మండే ఎండల్లో కళ్లను కాపాడేవి అని మాత్రమే తెలుసు. కానీ, ఇప్పుడు అవి కూడా కాలానికి తగ్గట్టు మారిపోయాయి. మేమూ టూ స్మార్ట్ అంటూ సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతున్నాయి. పా
చలువ కళ్లద్దాలు అంటే ఇంతకుముందు మండే ఎండల్లో కళ్లను కాపాడేవి అని మాత్రమే తెలుసు. కానీ, ఇప్పుడు అవి కూడా కాలానికి తగ్గట్టు మారిపోయాయి. మేమూ టూ స్మార్ట్ అంటూ సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతున్నాయి. పాటలు వినిపించేవీ, మ్యాపులు చూపించేవీ, రంగులు మారేవీ, ఆరోగ్యాన్ని అంచనా వేసేవీ ఇలా ఎన్నెన్నో ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. సమ్మర్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లా మనం వాడే సన్ గ్లాసెస్ కొత్త ముచ్చట్లపై ఓ లుక్కేద్దాం!అవసరానికి పెట్టుకున్నా అందంగా కనిపించే వాటి వరుసలో ముందుంటాయి సన్ గ్లాసెస్. అందుకే వీటితో ఎండాకాలాన్ని తమదైన స్టయిల్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాషన్ ప్రేమికులు. అయితే తాము అంతకుమించి అని నిరూపిస్తూ అటు ఫ్యాషన్‌లో ఇటు టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి అందమైన ఐనాలు.
మ్యాప్స్ చూసేయొచ్చు

ఏఐ కళ్ల ముందు మరో ప్రపంచాన్ని చూపిస్తున్నది. మన కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని లేదా ప్రదేశాన్ని ఇవి చక్కగా వివరిస్తాయి. దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కళ్లజోడు ద్వారానే మనకు చూపిస్తాయి. అలాగే అక్కడి బోర్డులు ఏ భాషలో ఉన్నా మనం ఎంచుకున్న భాషలోకి మార్చి చూపిస్తాయి. నడిచేప్పుడు లేదా డ్రైవ్ చేసేటప్పుడు డైరెక్షన్ చెప్తాయి. క్రికెట్ స్కోర్ లాంటివి క్షణంలో చెప్పేస్తాయి. అంతేకాదు మన కళ్లతో చూసేదాన్ని ఫొటోలు వీడియో రూపంలో బంధించమని ఒక మాట చెప్తే చాలు చక్కగా ఆ పని కూడా చేసి పెడతాయి. కళ్లతో చూసే ప్రతి అందమైన దృశ్యం ఎంచక్కా ఫొటో రూపంలో భద్రపరుస్తాయి. ఈ అడ్వాన్స్ ఫీచర్లకు తగ్గట్టే ధరలు కూడా లక్షల్లో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం ఏం కాదు కదా!
రంగులు మారే సన్ గ్లాసెస్
నీడలో ఉంటే తెల్లగా ఎండలోకి వెళితే కాస్త నలుపు రంగులోకి మారే సన్ గ్లాసెస్‌ని ఎప్పటినుంచో చూస్తున్నాం. కానీ మన డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా, స్టయిలిష్ లుక్ ఇచ్చేలా వివిధ రంగుల్లోకి మారే సన్ గ్లాసెస్ కూడా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. కలర్ చేంజింగ్ సన్ గ్లాసెస్ పేరిట వస్తున్న ఇవి. పసుపు, నీలం, ఊదా, గులాబీ లాంటి వర్ణాల్లో కనిపిస్తుంటాయి. మన ఇష్టాన్ని బట్టి సాదాగా ఉంచుకోవచ్చు లేదా కళ్లద్దాలకి వచ్చే బటన్ని నొక్కడం ద్వారా వివిధ రంగుల్లోకి వాటిని మార్చుకోవచ్చు. వీటిని చార్జింగ్ పెట్టుకుని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. ఒకే సన్ గ్లాసెస్‌తో బోలెడు స్టయిల్స్ ట్రై చేయొచ్చు.
కళ్లకు కాపలా

సన్ గ్లాసెస్ ఇప్పుడు మన ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే స్మార్ట్ గ్యాడ్జెట్‌గా మారుతున్నాయి. ఇవి సెన్సర్లు, AI టెక్నాలజీతో కూడిన స్మార్ట్ గ్లాసెస్. మన రోజువారీ యాక్టివిటీస్‌ను గమనిస్తూ ఆరోగ్యానికి సంబంధించిన డేటాను అందిస్తాయి. సూర్యకాంతిలో యూవీకిరణాలు ఎక్కువైతే అలర్ట్ చేస్తాయి. సూర్యకిరణాల తీవ్రతను బట్టి లెన్స్ ఆటోమేటిక్‌గా డార్క్/ లైట్ అవుతుంది. కళ్ల కదలికలు, రెప్పలు ఆర్పే విధానం ఆధారంగా అలసటను గుర్తించి అలర్ట్ ఇస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర రావడం లాంటి సందర్భాల్లోనూ చక్కగా ఉపయోగపడతాయి. పాదాల కదలికలు, క్యాలరీలు, స్టెప్స్ లెక్కించడం వంటి ఫీచర్లూ ఉంటాయి. కొన్ని మోడల్స్‌లో గుండె స్పందనను గమనించే సెన్సర్లు కూడా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఫ్యాషన్, ఫిట్నెస్, సేఫ్టీలను ఒకే ఫ్రేమ్‌లో అందిస్తాయి ఈ తరహా కళ్లజోళ్లు.
వారెవ్వా ఏమి ఫేసు…

కాలా చష్మా మనకు మరింత కరిష్మా తెచ్చి పెట్టాలంటే మన ఫేస్‌కి తగ్గ షేప్‌ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. అందుకోసం ఫ్యాషనిష్టుల సలహాలు తెలుసుకుంటే సరి. ఇక అప్పుడు ఎదుటివారు ఏమి ఫేసు అని పాడటమే తరువాయి!
- గుండ్రటి ముఖాకృతి ఉన్నవారికి చతురస్రాకార, దీర్ఘచతురస్రాకార ఫ్రేమ్‌లు చక్కగా నప్పుతాయి.
- పలకగా ఉండే ముఖ కట్టుకి గుండ్రటి లేదా దీర్ఘ వృత్తాకారంలో ఉండే ఫ్రేమ్స్ సూట్ అవుతాయి.
- హృదయకారంలో.. అంటే, నుదురు వెడల్పుగా గడ్డం భాగం సన్నగా ఉండే వారికి అవియేటర్, క్యాట్ ఐ తరహా ఫ్రేమ్‌లు మంచి ఆప్షన్.
- అదే ఓవెల్ షేపులో అంటే దీర్ఘ వృత్తాకారంలో ముఖం ఉండేవారికి దాదాపు అన్ని ఆకృతుల్లోని కళ్లజోళ్లు చక్కగా సరిపోతాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

