స్కాన్ చేయండి.. పంటల సమాచారం పొందండి!
రైతులు పంటల సమాచారం తెలుసుకునేందుకు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టాయి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, కృషి విజ్ఞాన్ కేంద్రం. ఓ బోర్డును ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను పొందుపరిచారు. వీటిని స్కాన్ చేస్తే పంటలు, ఇతర సమాచారం తెలుస్తుంది. రైతులకు గుడ్ న్యూస్ కదా ఇది.
సాంకేతికతను రైతుల చెంతకు చేర్చడంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (DDS)-కృషి విజ్ఞాన కేంద్రం (KVK) మరో ముందడుగు వేసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి గ్రామంలోని కేవీకే ప్రధాన ఆవరణలో క్యూఆర్ కోడ్లతో ఓ బోర్డు ఏర్పాటు చేసింది. రైతులు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్‌తో సాగు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సాధారణంగా కేవీకేను సందర్శించే రైతులు ప్రతి యూనిట్ వద్ద శాస్త్రవేత్త అందుబాటులో లేకపోతే వివరాలు తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్రం బయట పెద్ద బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి విభాగానికి ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు.
ఈ బోర్డులో..
పశుసంవర్ధక విభాగం: డెయిరీ, పశువులు, మేకల పెంపకం, పౌల్ట్రీ, పౌల్ట్రీ ఇంక్యుబేటర్
సేంద్రియ వ్యవసాయం: అజోల్లా, ఎన్రిచ్డ్ కంపోస్ట్, నాడెప్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్-వర్మీ వాష్, ద్రవ సేంద్రియ ఎరువులు, నేల సంరక్షణ
పంటల విభాగం: అగ్రో ఫారెస్ట్రీ, బొటానికల్స్ బ్లాక్, మెత్తని విత్తనాలు, పండ్ల తోటలు, నేచురల్ ఫార్మింగ్ క్రాప్ కేఫెటేరియా, స్టాగర్డ్ వెజిటబుల్ మాడల్, షుగర్ కేన్ షేడ్ నెట్ నర్సరీ, హార్టికల్చర్ షేడ్ నెట్
ఇతర విభాగాలు: బయో రిసోర్స్ సెంటర్, మెడిసినల్-హెర్బల్ గార్డెన్, ఫాడర్, ఫుడ్ ప్రాసెసింగ్, రెయిన్ గేజ్, అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెంటర్ వంటి 25 విభాగాలకు కోడ్లు ఉన్నాయి. వీటితోపాటు వెబ్ సైట్ (www.ddskvk.in), కేవీకే లొకేషన్, నేల పరీక్ష వివరాలు, వాట్సాప్ గ్రూప్‌లో చేరడానికి, శిక్షణా కార్యక్రమాల క్యాలెండర్‌కు కూడా ప్రత్యేక క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేశారు.
రైతులకు ఎలా ఉపయోగం?
కేవీకేకి వచ్చే రైతు తన స్మార్ట్ ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ చేసి, తనకు కావాల్సిన పంట లేదా యూనిట్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, దానికి సంబంధించిన సాగు విధానం, లాభాలు, ఖర్చు, శాస్త్రవేత్తల సూచనలతో కూడిన పూర్తి సమాచారం తెలుగు, ఇంగ్లిష్‌లో వస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా రైతులకు సాంకేతికతను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చామని, శాస్త్రవేత్తలు అందుబాటులో లేని సమయంలో కూడా రైతు స్వయంగా సమాచారం తెలుసుకోవచ్చు అని డీడీఎస్-కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వినూత్న సౌకర్యం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంత రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
– గున్నాల విట్టల్, జహీరాబాద్
వైతాళికుల వాణి
నేలతల్లిని నమ్ముకొని బతికే రైతు.. రేపటి తరాలకు ఆహార భద్రతను అందించే నిజమైన భవిష్యత్ నిర్మాత.
– డా. ఎమ్మెస్ స్వామినాథన్, వ్యవసాయ శాస్త్రవేత్త
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

