General Knowledge | ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారానికి ఎంపికైన సాహితీవేత్త ఎవరు
General Knowledge | సాహిత్య రంగంలో కృషి చేసినవారికి జర్మనీకి చెందిన బుక్ ట్రేడ్ సంస్థ ఇచ్చే ప్రతిష్ఠాత్మక శాంతి పురస్కారానికి ఎంపికైన భారత సంతతి బ్రిటిష్ రచయిత?
- సాహిత్య రంగంలో కృషి చేసినవారికి జర్మనీకి చెందిన బుక్ ట్రేడ్ సంస్థ ఇచ్చే ప్రతిష్ఠాత్మక శాంతి పురస్కారానికి ఎంపికైన భారత సంతతి బ్రిటిష్ రచయిత?
- భారత జాగృతి ప్రదానం చేసే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారానికి ఎంపికైన సాహితీవేత్త ఎవరు?
- భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా కొత్త అధిపతిగా నియమితులైన ఐపీఎస్ అధికారి ఎవరు?
- ఇండోనేసియా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో డబుల్స్‌లో తొలిసారిగా బంగారు పతకం సాధించిన భారతీయ జోడీగా రికార్డు సాధించిన ఆటగాళ్లు ఎవరు?
- తెలంగాణ రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు తీగల వంతెన,యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, మోజంజాహీ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు ఐదు విభిన్న విభాగాల్లో గ్రీన్ యాపిల్ అవార్డు ప్రకటించిన సంస్థ ఏది?
- ద కమ్యూనిటీ స్పిరిట్ ఇండెక్స్: ద వరల్డ్స్ ఫ్రెండ్లీయెస్ట్ సిటీస్ ఫర్ నాన్ నేటివ్స్ పేరుతో స్థానికేతరులకు స్నేహపూర్వకమైన, స్నేహపూర్వకం కాని నగరాల జాబితాలో
నిలిచినఉత్తమ, అధమ నగరాల పేర్లు చెప్పండి? - తెలుగు చిత్ర పరిశ్రమలో 1500కు పైగా పాటలకు నృత్యదర్శకత్వం వహించి, శరీర అవయవాల వైఫల్యం వల్ల ఇటీవల మరణించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అసలు పేరేంటి?
- అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు విమాన ప్రయాణం అంటే నెలకొన్న భయాన్ని పోగొట్టడానికి అధికారులు ఓ పిల్లిని ఉద్యోగిగా నియమించుకున్నారు. ఆ మార్జాలం పేరేమిటి?
- 127 గంటలపాటు కథక్ నృత్య ప్రదర్శన చేసి, అత్యంత సుదీర్ఘ కాలం నృత్యం చేసిన వ్యక్తిగాగిన్నిస్ రికార్డును సాధించిన మహారాష్ట్ర యువతి?
- ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణకు హరితహారం 9వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రదేశం?
జవాబులు
1. సల్మాన్ రష్దీ
2. ఆచార్య ఎన్.గోపి (తొలి గ్రహీత)
3. రవి సిన్హా (1988 ఛత్తీస్‌గఢ్ క్యాడర్ పోలీస్ అధికారి)
4. సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి (మలేసియా ఆటగాళ్ల మీద గెలిచారు)
5. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్
6. ఉత్తమ స్నేహపూర్వక నగరం టొరంటో (కెనడా), అంత స్నేహపూర్వకం గాని నగరం ఆక్రా (ఘనా).
7. ఎస్.రామారావు
8. డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్
9. శ్రుతి సుధీర్ జగ్తప్ (16 ఏండ్లు, లాతూర్ జిల్లా)
10. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్‌లో
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

