జామకాయలు
ఒక జమిందారు తాన ఎర్రి ఎంకన్న పని జేత్తుండె. వాడు ఏది జేసినా ఉల్టపల్ట ఉంటుండె. ఆయినె ఒకటి జెప్తె.. ఈడొకటి జేత్తుండె. ఈడు జమిందారు జామతోటకు కావలి ఉంటుండె. ఒకపారి జమిందారుకు ఆయినె తోటల పండిన జామకాయలు దినాల్నని బుద్ధి పుట్టింది.
ఒక జమిందారు తాన ఎర్రి ఎంకన్న పని జేత్తుండె. వాడు ఏది జేసినా ఉల్టపల్ట ఉంటుండె. ఆయినె ఒకటి జెప్తె.. ఈడొకటి జేత్తుండె. ఈడు జమిందారు జామతోటకు కావలి ఉంటుండె. ఒకపారి జమిందారుకు ఆయినె తోటల పండిన జామకాయలు దినాల్నని బుద్ధి పుట్టింది. ఎంటనే తోటకాడ కావలున్న ఎంకన్నకు మతులబు పంపిండు. ఆని గురించి జమిందారుకు బాగ ఎరుక గన్క.. ‘తియ్య తియ్యటియి.. ఎర్రెర్రటియి జామకాయలు తెంపి పంపు!’ అంట జెప్పిండు.
ఈడసలే ఎర్రి ఎంకన్ననాయె! ‘తియ్యటియి ఎవ్వో, ఒగరుయి ఎవ్వో ఎట్ల దెల్వాలె?’ అంట తాయిమాయైండు. ఆఖరుకు ఆనికో ఇకమతు దోశింది. అందినకాడికి అన్ని శెట్లు ఎక్కి, దోరదోరగ పండిన కాయలన్ని దెంపి, గంపల వోశిండు. తియ్యతియ్యని పండ్లన్నీ సంచిల ముల్లెగట్టి.. తీస్కపోయి జమిందారుకు ఇచ్చిండు. సంచిని జూడంగనే.. “ఎంకా! జామకాయలు తియ్యగున్నయా? ఒగరుగున్నయా?” అంట అడిగిండు జమిందారు. “అన్ని తియ్యతియ్యని పండ్లే దొరా!” అంట జెప్పిండు ఎర్రి ఎంకన్న. “నీకెట్ల దెలుసు!?” అనుకుంట, జమిందారు సంచి దెరిశి సూడంగనే.. అన్ని జామకాయలు కొరికి ఉన్నయి.
ఒంటి నిండా గాయాలు.. కడుపు నిండా రాగాలు?
– పిల్లనగోవి
నన్ను కొడతారు. దేవుణ్ని మొక్కుతారు?
– గుడి గంట
బొట్టు కాని బొట్టు?
– తాళిబొట్టు
మతి కాని మతి?
– శ్రీమతి
మర కాని మర?
– పడమర
2024 లీపు సంవత్సరం. అందుకే, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. మనందరికీ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి లీపు సంవత్సరం వస్తుంది. కానీ, చైనా, హిబ్రూ క్యాలెండర్లలో మూడేళ్లకు ఓసారి లీపు సంవత్సరం వస్తుంది.
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

