SRY Test : మహిళల టెన్నిస్‌లో విప్లవాత్మక నిర్ణయంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది మహిళల టెన్నిస్ సంఘం (WTA). ఇక నుంచి క్రీడాకారిణులకు జన్యు పరీక్షలను తప్పనిసరి చేసింది. లింగ నిర్ధారణ కోసం ఎస్‌ఆర్‌వై (లింగ నిర్ధారణ ప్రాంతం SRY) టెస్టు ద్వారా వారి నుంచి ధ్రువీకరణ పొందనుంది. అయితే.. మహిళల టోర్నీల్లో పోటీకి ముందు కెరీర్లో ఒకసారే ఎస్‌ఆర్‌వై పరీక్ష చేయాలని డబ్ల్యూటీఏ స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన జూలై 21, మంగళవారం నుంచి అమలులోకి రానుంది.
టెన్నిస్ క్రీడాకారిణులకు జన్యు పరీక్షలను తప్పనిసరి చేసింది మహిళల టెన్నిస్ సంఘం. ఇక నుంచి మహిళల ఈవెంట్లలో పోటీపడాలంటే లింగ నిర్ధారణ కోసం ఎస్‌ఆర్‌వై(లింగ నిర్ధారణ ప్రాంతం Y) టెస్టు చేయించుకోవాలని డబ్ల్యూటీఏ తెలిపింది.
క్రీడాకారిణులు చెంపలు(బుగ్గలు), రక్త నమూనాల నుంచి ఎస్‌ఆర్‌వై జన్యువును తీసి.. టెస్టు చేస్తారు. అయితే.. ఎవరికైనా కెరీర్లో ఒక్కసారే ఈ జన్యు పరీక్ష చేయనున్నారు. ఈ కొత్త నిబంధనతో.. గతంలో మాదిరిగా ట్రాన్స్జెండర్లను మహిళల విభాగంలో పోటీపడేందుకు అనుమతివ్వడం కుదరదని డబ్ల్యూటీఏ తేల్చేసింది.
As @BenRothenberg reports, the WTA is introducing new eligibility rules: all players will have to undergo a one-time cheek-swab test to screen for genetic markers associated with male development. https://t.co/6o4CmJcb9P
— Women’s Tennis Blog (@womenstennis) July 19, 2026
‘డబ్ల్యూటీఏ టోర్నమెంటల్లో పాల్గొనే మహిళా టెన్నిస్ ప్లేయర్లకు ఎస్‌ఆర్‌వై జన్యువు కోసం ఏకకాల స్క్రీనింగ్ టెస్టును బట్టి అర్హత ఉందో లేదో నిర్ధారిస్థాం. ప్లేయర్ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలోభాగంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. అత్యంత గోప్యంగా, అత్యుత్తమ ప్రమాణాలతో ఈ టెస్టు జరుపుతాం. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి.. గౌరవంగా చూస్తాం’ అని రాయిటర్స్ వార్తా సంస్థతో డబ్ల్యూటీఏ పేర్కొంది.
అంతర్జాతీయంగా ఇతర క్రీడల్లోనూ మహిళలకు జన్యు పరీక్షలు తప్పనిసరి చేసినందున తాము ఈ పద్ధతికి మొగ్గు చూపామని డబ్ల్యూటీఏ స్పష్టం చేసింది. మహిళల అథ్లెటిక్స్‌లో పోటీపడే వారు కచ్చితంగా జన్యు టెస్టు చేసుకోవాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధన పెట్టిన విషయం తెలిసిందే.
The women’s tennis tour has made it compulsory for its players to complete a one-off mandatory gene test to determine their eligibility.
The new policy will come into effect on Tuesday, at which point all competitors who wish to compete in the women’s category will have to be… pic.twitter.com/2bIgPTLynh
— The Athletic (@TheAthletic) July 20, 2026