టీమిండియా టెయిలెండర్లపై వాషింగ్టన్ తండ్రి సీరియస్

అహ్మదాబాద్: ఇండియన్ టీమ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మధ్య జరిగిన రెండు టెస్ట్ సిరీస్‌లలో బ్యాట్‌తో ఎలా రాణించాడో మనం చూశాం. ఆస్ట్రేలియాలో 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా, ఇప్పుడు ఇంగ్లండ్‌పై 96 రన్స్ చేసినా అది అతని బ్యాటింగ్ ప్రతిభకు నిదర్శనమే. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ టెయిలెండర్లు అతనికి సహకారం అందించకపోవడంతో సెంచరీ చేసే అవకాశం మిస్ అయ్యాడు. దీనిపైనే ఇప్పుడు వాషింగ్టన్ తండ్రి ఎం. సుందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెయిలెండర్లు ఆ మాత్రం సేపు క్రీజులో నిలదొక్కకోలేరా? ఒకవేళ ఇండియా విజయానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నపుడు వాళ్లు ఇలా ఔటై ఉంటే అది ఎంత పెద్ద తప్పిదం అయి ఉండేది. కోట్ల మంది యువకులు వాళ్ల ఆటను చూస్తున్నారు. వాళ్లు టెయిలెండర్ల నుంచి ఏమీ నేర్చుకోవద్దు అని సుందర్ అన్నారు.
టీమిండియా కేవలం 5 బంతుల వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోవడంతో వాషింగ్టన్ 96 పరుగులు చేసి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోవాల్సి వచ్చింది. అక్షర్ రనౌటైన తర్వాత ఇషాంత్ ఎల్బీడబ్ల్యూగా, సిరాజ్ క్లీన్ బౌల్డ్ అవడం ద్వారా ఔటయ్యారు. ఇదేమీ టెక్నిక్కు సంబంధించిన అంశం కాదని, క్రీజులో నిలబడటానికి ధైర్యం చాలని ఈ సందర్భంగా సుందర్ అన్నారు. ఇంగ్లండ్ అప్పటికే అలసిపోయింది. స్టోక్స్ కేవలం 126 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అదేమంత స్పీడు కానే కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌పై అందరూ బౌలర్ ముద్ర వేయడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని, అతనో బౌలింగ్ చేయగల బ్యాట్స్‌మన్‌గా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

