వారెవ్వా వొండ్రొసోవా
నిరుడు వింబుల్డన్ జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల మధ్య కూర్చొని తన స్నేహితురాలు గెలవాలని కోరుకున్న ఓ అనామక ప్లేయర్.. ఈ ఏడాది వరుస విజయాలతో విజృంభించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 42వ ర్యాంకర్ వొండ్రొసోవా 6-4, 6-4తో ఆరో సీడ్ జాబర్ (ట్యూనీషియా)పై గెలుపొందింది.
- అన్‌సీడెడ్‌గా వింబుల్డన్ టైటిల్ కైవసం
- తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు
వింబుల్డన్‌లో అతిపెద్ద సంచలనం నమోదైంది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఓ అనామక ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్‌లో అంచనాలే లేకుండా అడుగుపెట్టిన చెక్‌రిపబ్లిక్ ప్లేయర్ మార్కెటా వొండ్రొసోవా.. తుదిపోరులో జాబర్పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకుంది. తద్వారా ఓపెన్ ఎరాలో అన్‌సీడెడ్‌గా వింబుల్డన్ టైటిల్ గెలిచిన మొదటి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. నేడు జరుగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్తో జొకోవిచ్ తలపడనున్నాడు.
వింబుల్డన్: నిరుడు వింబుల్డన్ జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల మధ్య కూర్చొని తన స్నేహితురాలు గెలవాలని కోరుకున్న ఓ అనామక ప్లేయర్.. ఈ ఏడాది వరుస విజయాలతో విజృంభించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 42వ ర్యాంకర్ వొండ్రొసోవా 6-4, 6-4తో ఆరో సీడ్ జాబర్ (ట్యూనీషియా)పై గెలుపొందింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పరాజయం పాలైన వొండ్రొసోవా.. తన గ్రాండ్‌స్లామ్ కలను నెరవేర్చుకుంది. గంటా 20 నిమిషాల పాటు సాగిన కీలక పోరులో 10 విన్నర్లు సంధించిన 24 ఏండ్ల వొండ్రొసోవా.. 4 డబుల్ ఫాల్ట్స్ చేసింది. మరోవైపు 25 విన్నర్లతో సత్తాచాటిన జాబర్.. 31 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఏడింట ఆరు బ్రేక్ పాయింట్లు కాచుకున్న వొండ్రొసోవాను విజయం వరించింది. ‘అసలేం జరుగుతుంతో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఆకాశపు అంచుల్లో ఉన్నా. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను’అని మ్యాచ్ అనంతరం వొండ్రొసోవా భావోద్వేగానికి గురైంది.
అల్కరాజ్ x జొకోవిచ్
ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్ల మధ్య ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్ జరుగనుంది. టాప్ సీడ్ అల్కరాజ్ తొలిసారి వింబుల్డన్ టైటిల్ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంటే.. పురుషుల విభాగంలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి అగ్రస్థానంలో ఉన్న జొకో మరింత ఎత్తుకు ఎదగాలని భావిస్తున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తున్నది.
ప్రైజ్‌మనీ
విజేత: వొండ్రొసోవా-25.25 కోట్లు
రన్నరప్: జాబర్-12.62 కోట్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

