Virat Kohli: టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో దూసుకొస్తున్న కోహ్లీ..
Virat Kohli:పాకిస్థాన్‌పై విరోచిత ఇన్నింగ్స్‌తో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మళ్లీ తన సత్తా చాటాడు. దీంతో టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ కోహ్లీ దూసుకువస్తున్నాడు. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో.. టాప్ టెన్‌లో కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు. పాక్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఒక్కసారిగా ర్యాంకింగ్స్‌లో ఇరగదీశాడు. మెల్బోర్న్లో చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన
మెల్బోర్న్: పాకిస్థాన్‌పై విరోచిత ఇన్నింగ్స్‌తో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) మళ్లీ తన సత్తా చాటాడు. దీంతో టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ కోహ్లీ దూసుకువస్తున్నాడు. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో.. టాప్ టెన్‌లో కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు. పాక్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఒక్కసారిగా ర్యాంకింగ్స్‌లో ఇరగదీశాడు. మెల్బోర్న్లో చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా 82 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Virat Kohli on the rise 👊
The Indian star's sensational innings against Pakistan sees him surge up in the latest @MRFWorldwide ICC Men's T20I Player Rankings 📈
Details ⬇https://t.co/Up2Id40ri0
— ICC (@ICC) October 26, 2022
33 ఏళ్ల కోహ్లీ ఆ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లు కొట్టాడు. 53 బంతుల్లో 82 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అతను ఐసీసీ టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో అయిదు స్థానాలు ముందుకు వచ్చేశాడు. ఇక బుధవారం రిలీజైన ర్యాంకింగ్స్ లిస్టులో కోహ్లీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు.
పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ ప్రస్తుతం టీ20 బ్యాటర్స్ లిస్టులో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఆస్ట్రేలియాపై 92 రన్స్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే రెండవ స్థానాన్ని ఆక్రమించేశాడు. రిజ్వాన్ 849 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలువగా ఇప్పుడు ఆ స్థానంపై పలువురు బ్యాటర్లు కన్నేశారు. సూర్యకుమార్‌ను కాన్వే దాటేశాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, సౌతాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్లు కూడా టాప్ ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

