Virat Kohli | టెస్టుల్లో తొలిసారి కోహ్లీ స్టంపౌట్.. వన్డేలు, టీ20ల్లో ఎన్నిసార్లు ఇలా ఔటయ్యాడో తెలుసా..?
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మొదటిసారి స్టంపౌట్ అయ్యాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 180వ ఇన్నింగ్స్‌లో ఆడిన విరాట్ ఒక్కసారి మాత్రమే స్టంపౌట్ కావడం విశేషం. ఈ స్టార్ ప్లేయర్ వన్డేల్లో ఐదు సార్లు, పొట్టి క్రికెట్లో ఒకసారి మాత్రమే స్టంపౌట్‌గా వికెట్ సమర్పించుకున్నాడు. అంతేకాదు అతను అన్ని ఫార్మాట్లలో 25,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
Virat Kohli : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మొదటిసారి స్టంపౌట్ అయ్యాడు. టాడ్ మర్ఫీ ఓవర్లో కోహ్లీ ఫ్రంట్‌పుట్ వెళ్లడంతో బంతి మిస్ అయింది. బాల్ అందుకున్న అలెక్స్ క్యారీ వెంటనే వికెట్లను గిరాటేశాడు. దాంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇప్పటి వరకు 180వ ఇన్నింగ్స్‌లో ఆడిన ఈ లెజెండరీ క్రికెటర్ ఒక్కసారి మాత్రమే స్టంపౌట్ కావడం విశేషం. వన్డేలు, టీ20ల్లో కోహ్లీఎన్నిసార్లు ఇలా వెనుదిరిగాడో తెలుసా..? వన్డేల్లో ఐదు సార్లు, పొట్టి క్రికెట్లో ఒకసారి మాత్రమే స్టంపౌట్‌గా వికెట్ సమర్పించుకున్నాడు.
సచిన్ రికార్డు బ్రేక్
ఛేజింగ్ మాస్టర్‌గా పేరొందిన కోహ్లీ ఢిల్లీ టెస్టులో మరో ఘనత సాధించాడు. అన్ని ఫార్మాట్లలో 25వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా అతను రికార్డుల్లోకి ఎక్కాడు. దాంతో, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అతను బ్రేక్ చేశాడు. సచిన్ 577 మ్యాచుల్లో 25,000 రన్స్ స్కోర్ చేశాడు. కానీ, కోహ్లీ 549 మ్యాచుల్లోనే పాతిక వేల పరుగులు సాధించాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 44 రన్స్ చేశాడు. 115 లక్ష్య ఛేదనలో పూజారా 31, కేఎస్ భరత్ 23తో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. పది వికెట్ల ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాకుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దాంతో, ఇండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

