సెమీస్‌కు యువ భారత్.. సూపర్ సిక్స్ మ్యాచ్‌లో పాక్‌పై జయభేరి
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో యువ భారత జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సూపర్ సిక్స్ గ్రూప్-డీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 58 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసి ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో ఆ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
బులవాయొ : ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో యువ భారత జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సూపర్ సిక్స్ గ్రూప్-డీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 58 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసి ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో ఆ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బ్యాట్‌తో మోస్తరు స్కోరు చేసినప్పటికీ బంతితో దాయాదిని మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత అండర్ -19 జట్టు.. 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయింది.
పాక్ బౌలర్లు కట్టడిచేసినా వేదాంత్ త్రివేది (98 బంతుల్లో 68, 2 ఫోర్లు, 1 సిక్స్), కన్షిక్ చౌహాన్ (35) భారత్‌ను ఆదుకున్నారు. ఛేదనలో పాకిస్థాన్.. లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోనే ఛేదిస్తేనే సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా భారత బౌలర్లు కట్టడిచేయడంతో ఆ జట్టు సెమీస్ ఛాన్స్‌తో పాటు మ్యాచ్‌నూ కోల్పోయింది. 31 ఓవర్లకు 151/3గా ఉన్న పాక్.. ఆ తర్వాత 40 పరుగులకే కుప్పకూలి (46.2 ఓవర్లలో 194 రన్స్‌కు ఆలౌట్) ఓటమిని మూటగట్టుకుంది. ఖిలాన్ పటేల్ (3/35), అయూశ్ మాత్రె (3/21) మెరిశారు. సెమీస్‌లో భారత్.. అఫ్ఘానిస్థాన్‌తో ఆడనుండగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCU | హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
Nitesh Tiwari | బాక్సాఫీస్ చరిత్రలో నితేష్ తివారి కొత్త రికార్డు.. రెండు సార్లు రూ.1500 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి ఇండియన్ డైరెక్టర్!
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

