వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయమని టీమిండియా ప్లేయర్స్‌కు చెప్పాను!

ముంబై: 2011 వరల్డ్‌కప్ ఇండియన్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 1983 తర్వాత ఇండియన్ టీమ్ మరోసారి విశ్వవిజేతగా నిలిచిన టోర్నీ అది. ఆ సమయంలో ఇండియన్ టీమ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ గ్యారీ కిర్‌స్టెన్ ఉన్నాడు. అయితే అప్పట్లో అతడు ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్న మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టాన్ తాజాగా తన బుక్ ద బేర్‌ఫుట్ కోచ్‌లో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఆ వరల్డ్‌కప్‌లో ఓ మ్యాచ్‌కు ముందు ఇండియన్ టీమ్ ప్లేయర్స్‌ను సెక్స్ చేయాల్సిందిగా తాను సూచించినట్లు ఆ బుక్‌లో అప్టాన్ చెప్పాడు.
అయితే తాను ఇచ్చిన ఈ సలహా ప్రధాన కోచ్ కిర్‌స్టెన్‌కు ఆగ్రహం తెప్పించినట్లు కూడా అప్టాన్ ఆ బుక్‌లో రాశాడు. దీంతో తాను క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని అతను అన్నాడు. ఇక అంతకుముందు 2009 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కూడా తాను ప్లేయర్స్ కోసం నోట్స్ సిద్ధం చేశానని, అందులో సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా రాసినట్లు కూడా అప్టాన్ చెప్పాడు. సెక్స్ చేయడం వల్ల మీరు మెరుగైన ప్రదర్శన చేయగలరా? అన్న ప్రశ్నకు అవును, కచ్చితంగా అని అప్టాన్ చెప్పడం విశేషం. ఇవే కాదు రాహుల్ ద్రవిడ్‌ను శ్రీశాంత్ తిట్టడం, ధోనీ కెప్టెన్సీ గురించి కూడా అప్టాన్ తన బుక్‌లో ఎన్నో విషయాలు చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

