Tim David | టీ20లో అత్యధిక సిక్సర్లు.. వార్నర్ 16 ఏళ్ల రికార్డు బ్రేక్.!
Tim David : పొట్టి క్రికెట్లో సంచలనంగా మారిన టిమ్ డేవిడ్ (Tim David) మరో రికార్డు బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన సెంచరీతో రికార్డు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు డేవిడ్ వార్నర్ (David Warner)ను అధిగమించాడు.
Tim David : పొట్టి క్రికెట్లో సంచలనంగా మారిన టిమ్ డేవిడ్ (Tim David) మరో రికార్డు బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన సెంచరీతో రికార్డు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు ఈసారి డేవిడ్ వార్నర్ (David Warner)ను అధిగమించాడు. 16 ఏళ్లుగా డేవిడ్ భాయ్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్లు రికార్డును బద్ధలు కొట్టాడు డేవిడ్. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ యంగ్‌స్టర్ ఈ మైలురాయికి చేరువయ్యాడు.
మూడు టీ20ల సీరీస్ ఆరంభ పోరులో టిమ్ డేవిడ్ తన ఉగ్రరూపం చూపించాడు. డార్విన్‌లోని మర్రార క్రికెట్ మైదానంలో కష్టాల్లో పడిన జట్టును ఆదుకోవడమే కాదు రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 7.4 ఓవర్లకే ఆరు వికెట్లు పడిన వేళ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 52 బంతుల్లోనే 83 రన్స్ బాదాడు డేవిడ్. తన విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును ఉరికించిన ఈ యంగ్ష్టర్ ఏకంగా ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. దాంతో, ఆసీస్ పోరాడగలిగే స్కోర్ చేయగా.. ప్రొటిస్ జట్టుపై 2009లో ఆరు సిక్సర్లతో వార్నర్ నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది.
Tim David showing respect to Rabada 😂pic.twitter.com/OTRgBeg80K
— Out Of Context Cricket (@GemsOfCricket) August 10, 2025
డేవిడ్ హస్సీ, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్లు సైతం ఆరేసి సిక్సర్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. హసీ 2009లో మెల్బోర్న్ మైదానంలో .. 2023లో డర్బన్‌లో జరిగిన టీ20లో మార్ష్ ఈ ఘనత సాధించగా.. రెండు రోజుల్లోనే హెడ్ ఆరు సిక్సర్లతో 91 రన్స్‌తో రికార్డు సమం చేశాడు.
37 బంతుల్లోనే..
ఐపీఎల్లో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన టిమ్ డేవిడ్ జూలై 26న టీ20ల్లో తొలి శతకంతో గర్జించాడు. వెస్టిండీస్ (West Indies) బౌలర్లను ఊచకోత కోసిన ఈ చిచ్చరపిడుగు ఆసీస్ తరఫున వేగవంతవైన సెంచరీ బాదేశాడు. మూడో టీ20లో కరీబియన్లు నిర్దేశించిన భారీ ఛేదనలో డేవిడ్ కేవలం 37 బంతుల్లోనే ఈ మూడంకెల స్కోర్‌కు చేరుకున్నాడు. డేవిడ్ విధ్వంసంతో 2023లో స్కాట్లాండ్ (Scotland)పై 43 బంతుల్లో జోష్ ఇంగ్లిస్ నెలకొల్పిన వేగవంతమైన శతకం రికార్డు బద్ధలైంది.
THE FASTEST T20I 50 IN AUSTRALIAN HISTORY! 🔥 🔥 🔥
Tim David absolutely monsters his way to the half-century off 16 balls.
Catch every ball of Australia’s tour of the West Indies live on ESPN on Disney+ 📺 pic.twitter.com/YY0AEj2xn7
— ESPN Australia & NZ (@ESPNAusNZ) July 26, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

