Team India New Jersey | ప్రపంచకప్ కోసం టీమిండియాకు కొత్త జెర్సీ..! ఏం మార్పులు చేశారంటే..?
Team India New Jersey | ఈ ఏడాది భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ భారత జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ బుధవారం ప్రత్యేక గీతంతో కూడిన వీడియోను రిలీజ్ చేసింది.
Team India New Jersey | ఈ ఏడాది భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ భారత జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ బుధవారం ప్రత్యేక గీతంతో కూడిన వీడియోను రిలీజ్ చేసింది. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ ప్యాండ్యా, మహ్మద్ సిరాజ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు కొత్త జెర్సీలో మెరిశారు.
వాస్తవానికి టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్ వచ్చాక మూడు ఫార్మాట్లలో జెర్సీలను మార్చింది. టీ20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్టుల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ రూపొందించింది. అయితే, జెర్సీలపై కుడివైపు అడిడాస్ లోగోను, ఎడమవైపు బీసీసీఐ టీమ్ లోగోతో పాటు మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు, ఇండియా అని ఉంటుంది.
జెర్సీలో మార్పులు ఇవే..
తాజాగా వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని జెర్సీలో స్వల్ప మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ఉంచగా.. టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుకు కుదించింది. ఈ రెండు నక్షత్రాలు.. భారత్ రెండు వన్డే వరల్డ్‌కప్ (1983, 2011)లకు ప్రతీక అని పేర్కొంది. అయితే, కొత్త జెర్సీపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్రివర్ణ పతాకంతో కూడిన జెర్సీని ధరించి.. వరల్డ్ కప్‌ను నెగ్గడం ఖాయమని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్ వరల్డ్ కప్ ప్రారంభంకానున్నది. 14న అహ్మదాబాద్‌లో పాక్‌తో భారత జట్టు ఆడనున్నది. ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనున్నది.
ప్రపంచ కప్ కోసం భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అక్షర్ కిషన్ పటేల్, ఇషాన్, సూర్యకుమార్ యాదవ్.
1983 – the spark. 2011 – the glory.
2023 – the dream.
Impossible nahi yeh sapna, #3kaDream hai apna.@adidas pic.twitter.com/PC5cW7YhyQ— BCCI (@BCCI) September 20, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

