న్యూఢిల్లీ: జోరుమీదున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. పాకిస్థాన్ క్రికెటర్ రిజ్వాన్‌ను వెనక్కి నెట్టేశాడు సూర్య. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు రెండు హాఫ్ సెంచరీలతో హోరెత్తించిన సూర్య.. మెన్స్ ర్యాంకింగ్స్‌లోనూ రాకెట్లా దూసుకెళ్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్య 68 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదే టోర్నీలో నెదర్లాండ్స్‌పై కూడా కీలకమైన హాఫ్ సెంచరీ చేశాడు.
NEW #1 T20I BATTER 👑
The India superstar has claimed the top spot in the @MRFWorldwide ICC Men’s T20I Player Rankings ⬇️https://t.co/g0bNbLqMQk
— ICC (@ICC) November 2, 2022
ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ సాధించిన 23వ క్రికెటర్‌గా సూర్య నిలిచాడు. ఇక రెండవ ఇండియన్ బ్యాటర్‌గా కూడా నిలిచాడతను. గతంలో ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.