RR vs PBKS | ప్రభ్‌సిమ్రన్, స్టోయినిస్ మెరుపులు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం..!
RR vs PBKS : అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్ ముల్లన్‌ఫూర్ భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(59) ఎప్పటిలానే శుభారంభమివ్వగా.. కూపర్ కొన్నొల్లీ(30), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(30)లు దంచేశారు.
RR vs PBKS : అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్ ముల్లన్‌ఫూర్ భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(59) ఎప్పటిలానే శుభారంభమివ్వగా.. కూపర్ కొన్నొల్లీ(30), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(30)లు దంచేశారు. డెత్ ఓవర్లలో మార్కస్ స్టోయినిస్(62 నాటౌట్) సిక్సర్ల మోతతో పంజాబ్ స్కోర్ 200 దాటింది. బ్రిజేశ్ శర్మ వేసిన చివరి ఓవర్లో 4, 6 , 6 తో అర్ధ శతకం సాధించిన స్టోయినిస్ చివరి రెండు బంతుల్నీ బౌండరీ దాటించాడు. దాంతో, పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
పంతొమ్మిదో సీజన్లో దంచేస్తున్న పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(59) అర్ధ శతకంతో రెచ్ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. ముల్లన్‌పూర్‌లో మూడో ఓవర్లోనే ప్రియాన్ష్ ఆర్య(29)ను ఔట్ చేసి రాజస్థాన్‌కు ఆర్చర్ బ్రేకిచ్చాడు. అయినా జోరు తగ్గించని ప్రభ్‌సిమ్రన్ బర్గర్ ఓవర్లో రెండు ఫోర్లతో చెలరేగాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో సిక్సర్ బాదగా పంజాబ్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. తన ఓవర్లో రెండు సిక్సర్లతో రెచ్చిపోయిన కూపర్ కొన్నొల్లీ(30)ని యశ్ రాజ్ ఔట్ చేసి పరుగుల ప్రవాహానికి బ్రేకులు వేశాడు.
Muscling it BIG! 💪
🎥 Marcus Stoinis flexing his power with some gigantic hits in New Chandigarh 💥💥
Updates ▶️ https://t.co/fBbdVnF5Fx#TATAIPL | #KhelBindaas | #PBKSvRR | @punjabkingsipl pic.twitter.com/Tsh7KkdX85
— IndianPremierLeague (@IPL) April 28, 2026
స్టోయినిస్ విధ్వంసం
ప్రభ్‌సిమ్రన్, కొన్నొల్లీ ధనాధన్ ఆడగా పదో ఓవర్లోనే స్కోర్ వంద దాటింది. హాఫ్ సెంచరీ బాదిన ప్రభ్‌సిమ్రన్‌ను యశ్ రాజ్ పెవిలియన్ పంపాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్(30) జతగా.. మార్కస్ స్టోయినిస్(62 నాటౌట్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) జట్టుకు భారీ స్కోరందించే బాధ్యత తీసుకున్నాడు. మిడిల్ ఓవర్లలో రాజస్థాన్ బౌల్లు కట్టడి చేయగా రన్స్ ఎక్కువ రాలేదు.
Cooper Connolly ✅
Prabhsimran Singh ✅Youngster Yash Raj Punja stepped up to the challenge today! 👏
Updates ▶️ https://t.co/fBbdVnF5Fx#TATAIPL | #KhelBindaas | #PBKSvRR | @rajasthanroyals pic.twitter.com/sQP6n0CokE
— IndianPremierLeague (@IPL) April 28, 2026
గేర్ మార్చాలనుకున్న అయ్యర్‌ను బర్గర్ వెనక్కి పంపాడు. కానీ, ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లతో స్కోర్ 190కి చేరింది. బ్రిజేశ్ శర్మ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో స్టోయినిస్ 4, 4 ,6, 6, 4, 4 తో 24 రన్స్ పిండుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకోవడంతో పాటు రాజస్థాన్‌కు 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంలో స్టోయినిస్ కీలకమయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

