Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Steven Smith: ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steven Smith) తన కెరీర్లో మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో రన్ మెషీన్లా పేరొందిన అతడు తమ దేశ దిగ్గజం స్టీవ్ వా(Steve Waugh)ను అధిగమించాడు.
Steven Smith: ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steven Smith) తన కెరీర్లో మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో రన్ మెషీన్లా పేరొందిన అతడు తమ దేశ దిగ్గజం స్టీవ్ వా (Steve Waugh)ను అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఆసీస్ తరఫున అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో స్మిత్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
టెస్టు క్రికెట్లో పాపులర్ ఆటగాడైన స్టీవ్ స్మిత్ మరో మైలురాయిని సాధించాడు. ఫ్యాబ్-4లో ఒకడైన అతడు టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన ఆస్ట్రేలియా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. దక్షిణాఫ్రికాతో డర్బన్ టెస్టులో అతడు మాజీ కెప్టెన్ స్టీవ్ వా రికార్డును బద్ధలు కొట్టాడు. పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టీవ్‌ను నాలుగో స్థానానికి నెట్టేశాడీ రన్ మెషీన్.
ప్రస్తుతం స్మిత్ ఖాతాలో 10,945 రన్స్ ఉండగా.. వా పేరిట 10,927 పరుగులున్నాయి. ఈ ఫార్మాట్లో కంగరూల తరఫున అత్యధిక రన్స్ రికార్డు మాత్రం మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) వద్దే ఉంది వెటరన్ అలన్ బోర్డర్ (Allan Border) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పాంటింగ్ పేరిట 13,378 రన్స్ ఉండగా.. ఆల్‌టైమ్ దిగ్గజమైన బోర్డర్ 11,174 రన్స్ చేశాడు.
One Steve passes another 📈
Smith passes Waugh to become Australia’s third-leading run-scorer in Tests https://t.co/ifAnrDohF8
— Cricinfo (@cricinfo) October 9, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

