హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు వేదికవుతున్నది. జిల్లా చెస్ అసోసియేషన్, స్వదేశీ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ నెల 20,21 తేదీల్లో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలను నిర్వహిస్తున్నాయి.