శ్రీలంక క్రికెటర్‌పై రేప్ కేసు.. అరెస్ట్ చేసిన సిడ్నీ పోలీసులు
Danushka Gunathilaka |
సిడ్నీ: మహిళపై లైంగిక దాడి కేసులో శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక అరెస్టయ్యాడు. ఈ తెల్లవారుజామున సిడ్నీకి చెందిన సీటీ పోలీసులు గుణతిలకను అదుపులోకి తీసుకున్నారు. ధనుష్క గుణతిలక ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ ఆడేందుకు గత నెల తన జట్టుతో కలిసి వెళ్లాడు. ఈ నెల 2న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది.
దాంతో వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించిన శ్రీలంక జట్టు గుణతిలకను ఆస్ట్రేలియాలోనే వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయింది. కాగా, ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన గుణతిలక ఫస్ట్ రౌండ్లో నమీబియాతో జరిగిన ఒకే ఒక మ్యాచ్ ఆడి డకౌట్ అయ్యాడు. గాయం కారణంగా ఆ తర్వాత టోర్నీకి దూరమై రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఓ 29 ఏండ్ల మహిళ గుణతిలకపై రేప్ ఆరోపణలు చేశారు.
శ్రీలంక క్రికెటర్‌తో తనకు ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఇద్దరం ఒకరికొకరం ఆన్లైన్లో టచ్‌లో ఉన్నామని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో ఈ నెల 2న సాయంత్రం రోజ్ బేలోని తన నివాసానికి వచ్చిన గుణతిలక తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

