IPL 2024 SRH vs CSK : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండో ఐపీఎల్(IPL) మ్యాచ్ మరో గంటలో మొదలవ్వనుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో సైన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. గాయపడిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్టానంలో హైదరబాద్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ఆడుతున్నాడు. ఇక చెన్నై మూడు మార్పులు చేసింది. మోయిన్ అలీ, థీక్షణ, ముకేశ్ చౌదరీలు జట్టులోకి వచ్చారు.
హైదరాబాద్ జట్టు : అభిషేక్ శర్మ, మర్క్రమ్, క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితిశ్ రెడ్డి, షహ్బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి. నటరాజన్, జయదేవ్ ఉనాద్కాట్.
చెన్నై జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మోయిన్ అలీ, డారిల్ మిచెల్, శివం దూబే, జడేజా, ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, థీక్షణ.
సొంత మైదానంలో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ఏ రేంజ్లో చెలరేగుతారో చూశాం. ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులతో ఐపీఎల్ చరిత్రను తిరగరాశారు. టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకూ హిట్లర్లతో కూడిన హైదరాబాద్‌ను చెన్నై బౌలర్లు ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి.