ఐపీఎల్లో బలమైన బౌలింగ్ విభాగం ఉన్న సన్‌రైజర్స్‌పై చెన్నై ఓపెనర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఫామ్ కోసం తంటాలు పడుతూ కనిపించిన రుతురాజ్ గైక్వాడ్ (66 నాటౌట్) దంచి కొడుతున్నాడు. అతనికి డెవాన్ కాన్వే (29 నాటౌట్) నుంచి మంచి సహకారం లభిస్తోంది. దీంతో చెన్నై రన్ రేట్ దూసుకుపోతోంది.
రుతురాజ్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో చెన్నై స్కోరుబోర్డు పరుగులు పెడుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 100 పరుగులు పూర్తి చేసుకుంది. వాళ్ల బ్యాటింగ్ ఇదేమాదిరి కొనసాగితే సులభంగా 200పైగా స్కోరు చేసేలా కనిపిస్తున్నారు.