సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు నిలకడైన ఆరంభం లభించింది. కివీ ప్లేయర్ డెవాన్ కాన్వే (10 నాటౌట్) నిదానంగా ఆడుతుండగా.. రుతురాజ్ గైక్వాడ్ (26 నాటౌట్) కూడా నిలకడగా ఆడుతున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.
మార్కో జాన్సెన్ మూడు ఓవర్లు బౌలింగ్ చేయగా.. అతని బౌలింగ్‌లో గైక్వాడ్ రెండు చూడచక్కని సిక్సర్లు బాదాడు. మంచి టచ్‌లో కనిపిస్తున్న అతను భారీ స్కోరు చేస్తే చెన్నైను అడ్డుకోవడం కష్టమే.