చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బలంగా ఆరంభించింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (39) తన ఫామ్‌ను కొనసాగించగా.. కేన్ విలియమ్సన్ (18 నాటౌట్) ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకోకుండా అభిషేక్‌కు అవకాశం కల్పించాడు. ఈ క్రమంలో అభిషేక్ కుదిరిన బంతులను బౌండరీ దాటిస్తూ జట్టుకు శుభారంభం అందించాడు.
యితే అంతకుముందు అతని క్యాచ్ జారవిడిచిన ముకేష్ చౌదరి.. పవర్‌ప్లే చివరి ఓవర్లో అతన్ని వెనక్కు పంపాడు. చౌదరి వేసిన బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో లాంగాన్‌లో ప్రిటోరియస్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ మరుసటి బంతికే ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్ త్రిపాఠీ (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.
చౌదరి వేసిన షార్ట్ బాల్‌ను ఆడే క్రమంలో షార్ట్ థర్డ్ మ్యాన్‌లో ఉన్న సిమర్జీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.