న్యూయార్క్: మణికట్టు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్, ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ రీఎంట్రీకి రెడీ అయ్యాడు. ఈ నెల 30 నుంచి జరిగే యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు ‘హియర్ వి గో’ అని రాసి ఉన్న యూఎస్ ఓపెన్ లోగో ముందు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన రీఎంట్రీపై ప్రకటన చేశాడు.
ఏప్రిల్‌లో జరిగిన బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్ తర్వాత మణికట్టు గాయం తిరగబెట్టడంతో అల్కరాజ్ ఆ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ కారణంగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్స్లామ్స్కు అతడు దూరమయ్యాడు.