Sonal Dinusha : శ్రీలంక క్రికెటర్ సొనాల్ దినుష(Sonal Dinusha) రికార్డుల మోత మోగిస్తున్నాడు. కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం(103)తో లంకను ఆదుకున్న ఈ కుర్రాడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో గర్జించాడు. ఐదో రోజు టీ బ్రేక్ తర్వాత సింగిల్‌తో ఈ సిరీస్‌లో మూడోసారి మూడంకెల స్కోరందుకున్నాడీ లెఫ్ట్ హ్యాండర్. మొత్తంగా.. ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన ఎనమిదో లంక ప్లేయర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు దినుష.
కొలంబో టెస్టులో భారత్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న సొమాల్ దినుష రెండో సెంచరీ సాధించాడు. ఐదో రోజు రెండు సెషనల్లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి లంకను ఆదుకున్న అతడు.. టీ బ్రేక్ తర్వాత చిరస్మరణీయ వంద కొట్టాడు. తద్వారా భారత్‌పై ఒక టెస్టు మ్యాచ్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ బాదిన మూడో ఆటగాడిగా, ఇతరజట్లతో కలిపితే ఈ ఫీట్ సాధించిన ఎనిమిదో లంకేయుడిగా దినుష రికార్డు సృష్టించాడు. టీమిండియాపై అతడి కంటే ముందు.. దులీప్ మెండిస్ (1982లో చెన్నై, 1015, 105), అరవింద డిసిల్వా(1998 కొలంబో 146, 120)లు మాత్రమే రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకంతో మెరిశారు.
A 💯 yesterday, a 💯 today 👏
Sonal Dinusha is the third batter to score twin hundreds in a Test for a team that followed-on! pic.twitter.com/QEkCstMH0B
— Cricinfo (@cricinfo) August 27, 2026
అన్ని జట్లపై తీసుకుంటే.. దులీప్ మెండిస్(భారత్‌పై 1982లో), అరవింద డిసిల్వా(1997లో పాకిస్థాన్‌పై), తిలకరత్నే దిల్షాన్(2009లో బంగ్లాదేశ్‌పై), కుమార సంగక్కర(2013లో బంగ్లాదేశ్‌పై), ధనంజయ డిసిల్వా(2024లో బంగ్లాదేశ్‌పై), కమిందు మెండిస్(2024లో బంగ్లాదేశ్‌పై).. రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు సాధించారు.
Sonal Dinusha, take a bow 🙌
The eighth Sri Lanka batter to score two hundreds in a Test match – it’s his third in four innings this series 😮 pic.twitter.com/lYbuZpEwFE
— Cricinfo (@cricinfo) August 27, 2026