ICC Rankings: వన్డే బ్యాటర్లలో గిల్‌కు రెండో ర్యాంక్.. టెస్టు బౌలర్లలో బుమ్రాతో సమంగా హెన్రీ
ICC Rankings: మెన్స్ క్రికెట్‌కు చెందిన ర్యాంకింగ్స్‌ను ఇవాళ ఐసీసీ రిలీజ్ చేసింది. వన్డే బ్యాటర్లలో శుభమన్ గిల్ రెండో ర్యాంకులో ఉన్నాడు. ఇక టెస్టు బౌలర్లలో బుమ్రాకు సవాల్ ఎదురైంది. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ అతనికి పోటీ వచ్చేశాడు. ఆ ఇద్దరూ ఫస్ట్ ర్యాంక్ షేర్ చేసుకున్నారు.
దుబాయ్: మేటి వన్డే బ్యాటర్ల జాబితాను ఐసీసీ రిలీజ్ చేసింది. భారత కెప్టెన్ శుభమన్ గిల్ ఆ ర్యాంకు( ICC Rankings)ల్లో రెండో స్థానంలో నిలిచాడు. ఇక టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న జస్ప్రీత్ బుమ్రాకు సమంగా కివీస్ బౌలర్ మ్యాచ్ హెన్రీ వచ్చేశాడు. ఆ ఇద్దరూ ఇప్పుడూ టెస్టు బౌలింగ్ ర్యాంక్‌లో సమంగా ఉన్నారు. ఇక వన్డే బ్యాటింగ్‌లో కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్ తొలి స్థానంలో ఉన్నాడు. గిల్, మిచెల్ మధ్య 24 రేటింగ్ పాయింట్స్ తేడా ఉన్నది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ అద్భుతంగా రాణించాడు. దీంతో అతని ర్యాంకు మెరుగుపడింది. ఇక ఆఫ్ఘన్‌తో జరిగిన మూడో వన్డేలో అతనికి బ్యాటింగ్ రాలేదు. ఆ మ్యాచ్‌లో ఇండియా 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక రెండు వన్డేల్లో అతను 84, 154 రన్స్ స్కోరు చేశాడు. ఇషాన్ కిషణ్ 21 స్థానాలను దాటి ప్రస్తుతం 43వ ర్యాంక్‌కు చేరుకున్నది. వన్డే బౌలర్లలో అర్షదీప్ సింగ్ 22, ప్రసిద్ధ కృష్ణ 58, వాషింగ్టన్ సుందర్ 71వ స్థానంలో ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌లో ఆడని కోహ్లి ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక టెస్టుల్లో కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ దూసుకొస్తున్నాడు. బుమ్రాతో కలిసి అతను నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సుమారు 36 ఏళ్ల తర్వాత మళ్లీ కివీస్ బౌలర్ టాప్ ర్యాంకులో నిలిచాడు. గతంలో జాక్ కోవ్, రిచర్డ్ హాడ్లీ ఆ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో మ్యాట్ హెన్రీ 11 వికెట్లు తీసుకున్నాడు.
A new challenger for Jasprit Bumrah at the top of the Test bowling charts as an England veteran regains his place as the No.1 batter on a big update to the ICC Men’s Test Player Rankings 😲
Details 👇https://t.co/fFeN55q1dp
— ICC (@ICC) June 24, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

