Shubhman Gill | ఫుట్‌బాల్ జెర్సీతో శుభ్‌మన్ గిల్.. వావ్ అంటున్న ఫ్యాన్స్
Shubhman Gill : టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) ప్రస్తుత ఫామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) మాత్రం ఫ్యాన్స్‌ను గిల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఫైనల్ తర్వాత అతను తన ఫేవరెట్ ఫుట్‌బాల్ క్లబ్‌కు వెళ్లాడు. లిగ్ 1 క్లబ్ పారిస్ సెయింట్ జర్మనీ(PSG club) ఆటగాళ్లను...
Shubhman Gill : టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) ప్రస్తుత ఫామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) మాత్రం ఫ్యాన్స్‌ను గిల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఫైనల్ తర్వాత అతను తన ఫేవరెట్ ఫుట్‌బాల్ క్లబ్‌కు వెళ్లాడు. లిగ్ 1 క్లబ్ పారిస్ సెయింట్ జర్మనీ(PSG club) ఆటగాళ్లను కలిశాడు. ఈ సందర్బంగా.. గిల్ పేరు, అతడి టీమిండియా జెర్సీ నంబర్ 7 ముద్రించి ఉన్న జెర్సీని క్లబ్ యాజమాన్యం అతడికి జ్ఞాపకంగా అందించారు. ఫుట్‌బాల్ జెర్సీ పట్టుకుని ఉన్న గిల్ ఫొటోను ఆ క్లబ్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టింది.
ఆ ఫొటోకు.. ‘నమస్తే దోస్తులు.. భారత ఫేవరెట్ క్రికెటర్, పీఎస్జీ క్లబ్ అభిమాని శుభ్‌మన్ గిల్ పార్క్ డెస్ ప్రిన్సెస్‌లో ఉన్నాడు’ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌పై గిల్ స్పందించాడు. ‘అందరికీ హాయ్. నేను శుభ్‌మన్ గిల్. పీఎస్జీ క్లబ్‌ను కలిసే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు. ఎఫ్ఏ కప్ ఫైనల్ మ్యాచ్ చూసిన గిల్ ఆ తర్వాత మాంచెస్టర్ సిటీ క్లబ్ ప్లేయర్స్‌ను కలిశాడు.
🇮🇳 Namaste dosto, here’s India’s favorite cricketer and PSG fan @ShubmanGill at Parc des Princes 😍
🇮🇳 नमस्ते दोस्तो, पेश हैं भारत के पसंदीदा क्रिकेटर और पीएसजी के प्रशंसक शुभमन गिल पार्क डी प्रिंसेस में! 😍 pic.twitter.com/4xlqDkeyW9
— Paris Saint-Germain (@PSG_English) June 16, 2023
గిల్ సెంచరీ అభివాదం

3 ఫార్మాట్లు.. ఐపీఎల్లో
గత ఏడాది నుంచి శుభ్‌మన్ గిల్ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. శ్రీలంకపై వన్డేల్లో డబుల్ సెంచరీ, న్యూజిలాండ్‌పై టీ20ల్లో సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో మూడంకెల స్కోర్ సాధించాడు. దాంతో, ఒకే ఏడాది మూడు ఫార్మాట్లలో శతకాలు బాది రికార్డు సృష్టించాడు. అంతేకాదు16వ సీజన్ ఐపీఎల్‌లోనూ సెంచరీతో గిల్ తన బ్యాట్ పవర్ చూపించాడు. ఈ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఓపెనర్ అత్యధికంగా 890 పరుగులు కొట్టి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్లో అతడి ఖాతాలో మూడు సెంచరీలు ఉన్నాయి. ఎన్నో అంచనాలతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడిన అతను విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో (13), (18) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. ఐదో రోజు భారత్‌ను 234కు ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా టెస్టు గదను దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

