ఐపీఎల్ ప్లేయర్స్ దేశం కోసం ఏమీ చేయకపోవడం సిగ్గుచేటు: మోదీ

ముంబై: ఇండియా కొవిడ్ సంక్షోభంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నా ఐపీఎల్‌లోని ఇండియన్ ప్లేయర్స్ ఏ సాయం చేయకపోవడం సిగ్గు చేటని అన్నాడు ఈ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ. ఇండియాలో కరోనాపై పోరుకు ఐపీఎల్ లాభాల నుంచి రూ.700 నుంచి రూ.800 కోట్లను బీసీసీఐ ఇవ్వాలని మోదీ డిమాండ్ చేశాడు. నిజానికి ఇప్పటికే ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్‌తోపాటు ఇండియన్ ప్లేయర్స్ అజింక్య రహానే, శిఖర్ ధావన్, హార్దిక్, కృనాల్ పాండ్యాలాంటి వాళ్లు కొవిడ్‌పై పోరుకు తమ వంతు సాయం ప్రకటించారు. అటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా రూ.కోటి విరాళమిచ్చి.. మిగతా క్రికెటర్లు కూడా ఇవ్వాలని కోరాడు.
అయితే లలిత్ మోదీ మాత్రం ఇది చాలదన్నట్లుగా స్పందించాడు. ఇండియా ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్తు సందర్భంగా ఇండియన్ క్రికెటర్లు ఎలా స్పందించారో చరిత్ర ఎన్నటినీ మరవదు. ప్రజల కోసం మన ప్లేయర్స్ ఏమీ చేయడం లేదన్న కారణంగా నేను గత కొన్ని రోజులుగా ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా చూడలేదు అని మోదీ మిడ్ డే మీడియా సంస్థతో చెప్పాడు. లీగ్గానీ, ప్లేయర్స్గానీ ఏమీ చేయలేకపోవడం సిగ్గు చేటు అని మోదీ అనడం విశేషం. రోజువారీగా ఈ సమస్యపై స్పందించకపోవడం తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని అన్నాడు. ప్రస్తుతం లలిత్ మోదీ లండన్‌లో తలదాచుకుంటున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

