చెన్నై: ఈ యేటి ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) మరో 5 రోజుల్లో ప్రారంభంకానున్నది. అయితే ఆ సీజన్ ప్రారంభానికి ముందు.. చెన్నైలోని చిదంబరం స్టేడియంలోలో సీఎస్కే(CSK) జట్టు ఫ్యాన్ ఎంగేజ్మెంట్ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను గౌహతితో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనున్నది. అయితే ఆదివారం చెపాక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చెన్నై మాజీ ప్లేయర్లతో పాటు ప్రజెంట్ ప్లేయర్లు క్రికెట్ అభిమానుల్ని థ్రిల్ చేశారు. లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్, సీఎస్కే ప్లేయర్ ధోనీ, సంజూ శాంసన్ మైదానంలో హల్ చల్ చేశారు.
చెన్నై జట్టుకు కొత్తగా రిక్రూట్ అయిన శాంసన్.. మురళీధరన్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఆ ఓవర్‌కు ధోనీ కీపింగ్ చేశాడు. అయితే తొలి రెండు బంతుల్ని డిఫెన్స్ ఆడిన శాంసన్.. ఆ తర్వాత భారీ హిట్‌కు ప్రయత్నించాడు. ముందుకు వచ్చి ఆ బంతిని కొట్టబోయాడు. కానీ శాంసన్ బ్యాట్ నుంచి బంతి మిస్సైంది. కీపర్ ధోనీ ఆ బంతిని అందుకుని స్టంప్ చేయబోయాడు. కానీ స్టంప్స్‌ను కొట్టకుండా కావాలని మిస్ చేశాడు. ఇక ఆ తర్వాత బంతిని కూడా శాంసన్ కనెక్ట్ చేయలేకపోయాడు. ఇక ఫైనల్ బంతికి మాత్రం భారీ సిక్సర్ కొట్టాడు. ఆ బంతి స్టాండ్స్‌లోకి వెళ్లి పడింది. దీంతో చెపాక్ మైదానంలోని ప్రేక్షకులు ఫుల్ చీర్స్ కొట్టారు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
Sanju Samson vs Muttiah Muralitharan full contest 😂💛
This is so fun💛
Sanju was almost stumped by MS Dhoni but he missed 😅 pic.twitter.com/vcNPA3X3AG
— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) March 22, 2026