Cristiano Ronaldo | సౌదీ అరేబియా క్లబ్ తరఫున తొలి మ్యాచ్ ఆడనున్న రొనాల్డో
అల్ నస్రీ, పీఎస్జీ క్లబ్ మధ్య జనవరి 19న ఫ్రెండ్లీ మ్యాచ్
Cristiano Ronaldo : పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టయానో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ తరఫున తొలి మ్యాచ్ ఆడనున్నాడు. అది కూడా అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ నాయకత్వంలోని ప్యారిస్ సెయింట్ జర్మెన్ (పీఎస్జీ) క్లబ్‌తో. అల్ నస్రీ, అల్ హిలాల్ క్లబ్‌లతో కలగలసిన టీమ్ పీఎస్జీ క్లబ్ జనవరి 19న తలపడనున్నాయి. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో రొనాల్డో తొలిసారిగా కొత్త క్లబ్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ తర్వాత రొనాల్డో ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. దాంతో, అతను ఎలా ఆడతాడు? మెస్సీని నిలువరిస్తాడా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కొత్త ఏడాదిలో కొత్త క్లబ్‌తో శుభారంభం చేయాలని రొనాల్డో భావిస్తున్నాడు. ‘పీఎస్జీ క్లబ్‌తో ఆడనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే.. ఆ వెంటనే మూడు రోజుల తర్వాత మాకు ఛాంపియన్షిప్ గేమ్ ఉంది. షెడ్యూల్ పట్ల అసంతృప్తిగా ఉన్నాం’ అని నస్రీ క్లబ్ మేనేజర్ రుడీ గార్సియా ఒక ప్రకటనలో తెలిపాడు.
ఫిఫా వరల్డ్ కప్ సమయంలో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ రొనాల్డోతో ఒప్పందం రద్దు చేసుకుంది. దాంతో, ఈ స్టార్ ఆటగాడిని సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్200 మిలియన్ డాలర్ల భారీ ధరకు దక్కించుకుంది. అతడిని కొన్న వారం రోజులకే ఆ క్లబ్ సోషల్‌మీడియాలో ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది. ప్రస్తుతం అల్ నస్రీకి కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాలో ఎక్కువమంది అభిమానులు ఉన్న ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడిని 53 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

