Ricky Ponting : ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ గురించి ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉపఖండంలో అతని రికార్డు ఏమంత గొప్పగా లేదని అన్నాడు. ‘ఆస్ట్రేలియా బయట ముఖ్యంగా ఉపఖండంలో ట్రావిస్ హెడ్ రికార్డు ఏమంత బాగా లేదు. అంతేకాదు ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సగటు 24 మాత్రమే’ అని పాంటింగ్ తెలిపాడు. జనవరిలో స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో హెడ్ ఆకట్టుకున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో 90 రన్స్ చేశాడు.
భారత్‌తో తొలి టెస్టుకు వరల్డ్ నంబర్ 4 బ్యాటర్ అయిన హెడ్‌ను తీసుకోకపోవడంపై ఆసీస్ కెప్టెన్ కమిన్స్, కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. తుది జట్టులో హెడ్ లేకపోవడంతో ఆశ్చర్యపోయానని మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ అన్నాడు.
హెడ్ ప్లేస్‌లో..
హెడ్ ప్లేస్‌లో హ్యాండ్స్కాంబ్ లేదా రెన్ షాలో ఒకరికి చోటు దక్కొచ్చు అనుకున్నారంతా. కానీ, ఆశ్చర్యకరంగా ఇద్దరిని ఆడించారు. జడేజా ఓవర్లో రెన్ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. హ్యాండ్స్కాంబ్ 31 పరుగులతో రాణించాడు. కీపర్ క్యారీతో కలిసి ఫిఫ్టీ రన్స్ జోడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.