IND vs SL | కొలంబోలో వర్షం.. భారత ఇన్నింగ్స్‌కు అంతరాయం..!
IND vs SL : కొలంబో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. టీ బ్రేక్‌కు ముందే ఆకాశంలో మబ్బులు కమ్ముకోగా.. కాసేపటికే వాన అందుకుంది. దాంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
IND vs SL : కొలంబో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. టీ బ్రేక్‌కు ముందే ఆకాశంలో మబ్బులు కమ్ముకోగా.. కాసేపటికే వాన అందుకుంది. దాంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. శ్రీలంక బౌలర్లను ఎడాపెడా ఉతికేస్తున్న రిషభ్ పంత్(63) ఔటైనా.. ధ్రువ్ జురెల్(95 నాటౌట్) శతకానికి చేరువయ్యాడు. ఇప్పటికే భారీ స్కోర్ కొట్టిన టీమిండియా జురెల్ సెంచరీ అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది.
భారత ఆటగాళ్ల జోరుకు వరుణుడు అడ్డుపడ్డాడు. కాసేపట్లో టీ బ్రేక్ అనగా స్టేడియంలో మేఘాలు కమ్ముకున్నాయి. దాంతో, అంపైర్లు ముందుగానే టీ బ్రేక్ ప్రకటించారు. ఊహించిన్నట్టే వాన అందుకోవడంతో.. టీమిండియా ఇన్నింగ్స్ కాస్త ఆలస్యంగా మొదలవ్వనుంది. ఆట నిలిచే సరికి భారత్ స్కోర్.. 475/8.
The covers are 🔛 as rain 🌧️ stops play in Colombo!
Early Tea has been taken.
Stay tuned for further updates!
Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#TeamIndia | #SLvIND pic.twitter.com/P1KE44B0uH
— BCCI (@BCCI) August 24, 2026
ఫిఫ్టీ.. ఫిఫ్టీ
ఓవర్‌నైట్ స్కోర్ 300/5తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. అరంగేట్రం చేసిన సరాన్ష్ జైన్(6) నిరాశపరిచాడు. తొలి రోజు రిటైర్డ్ హర్ట్ అయిన రిషభ్ పంత్(63) రెండో రోజు తొలి సెషన్లోనే సరాన్ష్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్(95 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పంత్… ఈ క్రమంలోనే ధోనీ ఆల్‌టైమ్ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతేకాదు టెస్టుల్లో 21వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడీ హిట్టర్.
That will be lunch on Day 2 in Colombo!
A strong morning session for #TeamIndia 🙌
Rishabh Pant (63*) & Dhruv Jurel (59*) at the crease as India reach 419/6 after 112 overs 👏👏
Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/7BczhIFBVc
— BCCI (@BCCI) August 24, 2026
ప్రభాత్ జయసూర్య ఓవర్లో బౌండరీతో జురెల్ సైతం యాభై రన్స్ సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడికిది మూడో ఫిఫ్టీ. వీరిద్దరూ శతక భాగస్వామ్యం నెలకొల్పగా.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 419 రన్స్ చేసింది. భోజన విరామం తర్వాత మొదటి బంతికే పంత్ ఔటయ్యాడు. మానవ్ సుతార్(18) జతగా ఇన్నింగ్స్ నిర్మించిన జురెల్.. శతకానికి చేరువయ్యాడు. అసితా ఫెర్నాండో ఓవర్లో బౌండరీతో అతడు 95కి రాగా.. అప్పటికే కొలంబో టెస్టులో అప్పటికే అకాశం మబ్బుపట్టడంతో.. అంపైర్లు ముందుగానే టీ సెషన్ ప్రకటించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

