DC vs RR | రాజస్థాన్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం..!
DC vs RR : ప్లే ఆఫ్స్ రేసుకు ఆమడ దూరంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలోని రాజస్థాన్ రాయల్స్‌కు షాకిచ్చింది. భారీ ఛేదనలో ఓపెనర్లు కేఎల్ రాహుల్(56), పొరెల్(51).. శతక భాగస్వామ్యంతో గెలుపు పునాది వేశారు.
DC vs RR : ప్లే ఆఫ్స్ రేసుకు ఆమడ దూరంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలోని రాజస్థాన్ రాయల్స్‌కు షాకిచ్చింది. భారీ ఛేదనలో ఓపెనర్లు కేఎల్ రాహుల్(56), పొరెల్(51).. శతక భాగస్వామ్యంతో గెలుపు పునాది వేశారు. కానీ టపటపా మూడు వికెట్లు పడడంతో రాజస్థాన్ పోటీలోకి వచ్చింది. కానీ అక్షర్ పటేల్ (34 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు ఇంప్యాక్ట్ సబ్ అశుతోష్(18 నాటౌట్) మెరుపులు తోడవ్వగా ఢిల్లీ 5 వికెట్లతో గెలుపొంది ఆశలు సజీవంగా ఉంచుకుంది.
పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ రేసులోని జట్లకు వరసగా షాక్‌లు తగులుతున్నాయి. చావోరేవో పోరులో రాజస్థాన్‌ను 193కే నిలువరించిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్(56), అభిషేక్ పొరెల్(51) అదిరే ఆరంభమిచ్చారు. పట్టుదలగా ఆడిన ఈ ఇద్దరూ రాజస్థాన్ బౌలర్లకు అవకాశమివ్వకుండా బౌండరీలతో లక్ష్యాన్ని కరిగించారు. పవర్ ప్లేలో కొట్టిన ఈ ద్వయం శతక భాగస్వామ్యంతో ఢిల్లీని గెలుపు దిశగా నడిపింది. పదో ఓవర్ తర్వాత పొరెల్ ఔటైనా.. సహిల్ పరాఖ్(9) తోడుగా రాహుల్ ఇన్నింగ్స్ నిర్మించాడు. పరాఖ్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు అర్చర్.
Openers sailing along in the chase ⛵️
KL Rahul 🤝 Abishek Porel #DC 72/0 after the powerplay.
Updates ▶️ https://t.co/JwHkQQ1ayi #TATAIPL | #KhelBindaas | #DCvRR pic.twitter.com/He1EMYCSvQ
— IndianPremierLeague (@IPL) May 17, 2026
క్రీజునంటుకున్న రాహుల్‌ను శనక బౌల్డ్ చేయడంతో రాజస్థాన్ ఆశలు చిగురించాయి. ఢిల్లీకి మరో ఝలికిస్తూ స్టబ్స్(4)ను వెనక్కి పంపాడు ఆర్చర్. డేంజరస్ మిల్లర్(9)ను బ్రిజేశ్ ఔట్ చేయగా.. అక్షర్ పటేల్(34 నాటౌట్) సిక్సర్ కొట్టగా చివరి ఓవర్లో 7 రన్స్ ఢిల్లీకి అవసరం కాగా.. ఉత్కంఠ నెలకొంది. ఇంప్యాక్ట్ సబ్ అశుతోష్ (18 నాటౌట్) తొలి బంతికే బౌండరీ, సిక్సర్‌తో ఢిల్లీకి 5 వికెట్ల విజయాన్ని, కీలకమైన రెండు పాయింట్లను కట్టబెట్టాడు.
Jofra Archer returns ⚡️
…and brings the smiles right back to the #RR camp 🩷Interesting last 3️⃣ overs coming ⏳
Updates ▶️ https://t.co/JwHkQQ1ayi #TATAIPL | #KhelBindaas | #DCvRR pic.twitter.com/kOvuTyAvKO
— IndianPremierLeague (@IPL) May 17, 2026
జురెల్, వైభవ్ మెరుపులు
గెలవక తప్పని మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ అవకాశాన్ని చేజార్చుకుంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(46) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. యశస్వీ(12) త్వరగానే ఔటైనా.. ధ్రువ్ జురెల్(53) జతగా చెలరేగిన వైభవ్.. మిచెల్ స్టార్క్(4-40), ఎంగిడి(2-24) వంటి సీనియర్ పేసర్లకు షాకిస్తూ సిక్సర్లతో అలరించాడు. అతడి విధ్వసంతో పవర్ ప్లేలోనే రాజస్థాన్ వికెట్ నష్టానికి 75 రన్స్ చేసింది. హాఫ్ సెంచరీ ముందు వైభవ్ ఔటైనా.. జురెల్, రియాన్ పరాగ్(51) దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును ఉరికించారు.
Innings Break!
A superb comeback by #DC to restrict #RR to 193 🎯
2⃣ points loading for? 🤔
Scorecard ▶️ https://t.co/JwHkQQ1ayi #TATAIPL | #KhelBindaas | #DCvRR pic.twitter.com/cgAvLfSySW
— IndianPremierLeague (@IPL) May 17, 2026
కానీ, స్టార్క్ మిడిల్ ఓవర్లలో దెబ్బకొట్టాడు. 15వ ఓవర్లో వరస బంతుల్లో పరాగ్, ఫెరీరా(0)ను.. ఐదో బంతికి రవి సింగ్(4)ను పెవిలియన్ చేర్చడంతో రాజస్థాన్ స్కోర్ వేగం తగ్గింది. డెత్ ఓవర్లలో ఎంగిడి, స్టార్క్‌లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ బ్యాటర్లకు దంచేసే అవకాశమే రాలేదు. ఫలితంగా చివరి 36 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి కేవలం 33 పరుగులే చేసింది రాజస్తాన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

