DC vs RR | దంచేసిన నిశాంక, రాహుల్.. ఢిల్లీకి నాలుగో విజయం..!
DC vs RR : అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్‌కు చెక్ పెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. జైపూర్‌లో శుక్రవారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుతం చేసింది.
DC vs RR : అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్‌కు చెక్ పెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. జైపూర్‌లో శుక్రవారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుతం చేసింది. 226 పరుగుల ఛేదనలో కేఎల్ రాహుల్(75), పథుమ్ నిశాంక(62) శతక భాగస్వామ్యంతో పునాది వేశారు. ఆర్చర్ భయపెట్టినా.. స్టబ్స్(18 నాటౌట్), అశుతోష్ శర్మ(25 నాటౌట్)లు రాణించడంతో హ్యాట్రిక్ ఓటముల తర్వాత విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది ఢిల్లీ.
రాజస్థాన్ నిర్దేశించిన భారీ ఛేదనను ఢిల్లీ ఓపెనర్లు దూకుడుగా మొదలెట్టారు. ఈ సీజన్లో విఫలమవుతున్న పథుమ్ నిశాంక(62) ఆర్చర్, బర్గర్ బౌలింగ్‌లో ఎడాపెడా దంచేశాడు. పవర్ ప్లే చివరి బంతికి సిక్సర్‌తో 22 బంతుల్లో తొలి అర్ధ శతకంతో మెరిశాడు. కేఎల్ రాహుల్(75) .. ఢిల్లీ గెలుపు దిశగా సాగింది. మ్యాచ్‌ను లాగేసుకుంటున్న జోడీని ఎట్టకేలకు జడేజా విడదీశాడు. స్వీప్ షాట్ ఆడాలనుకున్న నిశాంక వికెట్ల ముందు దొరికిపోవడంతో తొలి వికెట్ 101 భాగస్వామ్యానికి తెరపడింది.
Dealing in maximums 🙌
🎥 Nitish Rana made the chase look easy for #DC with his six-hitting 💥💥
Updates ▶️ https://t.co/6OOjzHtZiD#TATAIPL | #KhelBindaas | #RRvDC | @DelhiCapitals pic.twitter.com/N91VH47TuL
— IndianPremierLeague (@IPL) May 1, 2026
ఆ తర్వాత నితీశ్ రాణా(33) జతగా మరింత రెచ్చిపోయిన రాహుల్.. అవసరమైన రన్‌రేటును 9కి తీసుకొచ్చాడు. దేశ్‌పాండే ఓవర్లో రాణా వికెట్ కీపర్ జురెల్ చేతికి చిక్కాడు. 30 బంతుల్లో 53 పరుగులు కావాల్సిన దశలో.. ఆర్చర్ ఓవర్లో్ ఫోర్ బాదిన రాహుల్ నేరుగా ఫెరీరాకు క్యాచ్ ఇచ్చాడు. కానీ, స్టబ్స్(18 నాటౌట్), అశుతోష్ శర్మ(25 నాటౌట్) ద్వయం నింపాదిగా ఆడి రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లింది. చివరి ఓవర్లో సింగిల్ తీయగా ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్
సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(90) దుమ్మురేపాడు. ప్రతిమ్యాచ్‌లో శుభారంభమిస్తున్న ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(6), వైభవ్ సూర్యవంశీ (4)లు విఫలమైనా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరందించాడు. ఎప్పటిలానే ధ్రువ్ జురెల్(42) తన విధ్వంసాన్ని కొనసాగించగా.. డెత్ ఓవర్లలో డొనొవాన్ ఫెరీరా(47 నాటౌట్) పిడుగల్లే ఢిల్లీ బౌలర్లపై పడ్డాడు. చివరి మూడు ఓవర్లలో 52 రన్స్ పిండుకున్న ఫెరీరా ఢిల్లీకి 226 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకమ్యాడు.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

