Rahul Dravid | రాహుల్‌కు మద్దతిస్తూనే ఉంటాం.. ఎందుకంటే..? : ద్రవిడ్
ఫామ్ లేక తంటాలు పడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతుగా నిలిచాడు. ఫామ్ కోల్పోవడం అనేది ఒక దశ మాత్రమే. విదేశీ పర్యటనల్లో విజయవంతమైన భారత ఓపెనర్లలో రాహుల్ ఒకడని అన్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ మూడు ఇన్నింగ్స్‌ల్లో 38 రన్స్ స్కోర్ చేశాడంతే.
Rahul Dravid : ఫామ్ లేక తంటాలు పడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతుగా నిలిచాడు. టీమ్ మేనేజ్మెంట్ రాహుల్‌ను సపోర్ట్ చేస్తుందని తెలిపాడు. ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో 6 వికెట్ల విజయం అనంతరం అతను మీడియాతో మాట్లాడాడు. రాహ్ల్కు అతడి ఆటపై నమ్మకం ఉండాలి అని ద్రవిడ్ అన్నాడు. ‘ఫామ్ కోల్పోవడం అనేది ఒక దశ మాత్రమే.
విదేశీ పర్యటనల్లో విజయవంతమైన భారత ఓపెనర్లలో రాహుల్ ఒకడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌లో రాహుల్ శతకాలు బాదాడు. అందుకని మేము అతడికి మద్దతు ఇస్తూనే ఉంటాం’ అని రాహుల్‌ను వెనకేసుకు రావడానికి గల కారణాన్ని హెడ్ కోచ్ వెల్లడించాడు.
3 ఇన్నింగ్స్‌ల్లో 38 రన్స్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు దక్కించుకునేందుకు భారత్‌కు ఈ సిరీస్ చాలా కీలకం. అలాంటి సిరీస్‌లో ఓపెనర్లు శుభారంభం ఇవ్వడం ఎంతో ముఖ్యం. అయితే.. కేఎల్ రాహుల్ మాత్రం వరుసగా విఫలమవుతూ నిరాశపరిచాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో అతను 38 రన్స్ స్కోర్ చేశాడంతే. అది కూడా 12.66 సగటుతో. గత ఏడాది కూడా రాహుల్ అంతగా ఫామ్‌లో లేడు. 8 ఇన్నింగ్స్‌ల్లో ఒక ఫిఫ్టీతో 137 పరుగులు సాధించాడు.
సూపర్ ఫామ్‌లో గిల్
రాహుల్ ప్లేస్‌లో యంగ్‌స్టర్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వన్డేలు, టీ20ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఓపెనర్‌గా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రీలంక, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో అతను రోహిత్‌తో కలిసి శుభారంభం ఇచ్చాడు. ఈ జోడీ రెండు సార్లు వందకు పైగా భాగస్వామ్యాలు నిర్మించింది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. 115 లక్ష్య ఛేదనలో పూజారా 31, కేఎస్ భరత్ 23తో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. పది వికెట్ల ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాకుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో, ఇండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

