IPL 2021 : పృథ్వీ షా మెరుపులు..ఢిల్లీ సూపర్ విక్టరీ

అహ్మదాబాద్: ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్ని అందుకున్నది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. కోల్‌కతా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పృథ్వీ షా(82: 41 బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపు అర్ధశతకానికి తోడు శిఖర్ ధావన్(46: 47 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) విజృంభించడంతో ఢిల్లీ అలవోకగా గెలిచింది. కోల్‌కతా బౌలర్లలో పాట్ కమిన్స్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు కోల్‌కతా ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్(43: 38 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్), ఆఖర్లో ఆండ్రూ రస్సెల్(45 నాటౌట్: 27 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. నితీశ్ రాణా(15), రాహుల్ త్రిపాఠి(19), మోర్గాన్(0), సునీల్ నరైన్(0), దినేశ్ కార్తీక్(14) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

