Prithvi Shaw : భారత సీనియర్ జట్టుకు ఆడాలని కలలు కంటున్న కుర్రాళ్లు ఐపీఎల్(IPL)లో చెలరేగేందుకు సిద్ధమవుతున్నారు. అదిరే ఆటతో సెలెక్టర్ల కంట్లో పడి టీమిండియా జెర్సీ వేసుకోవాలని కొందరు తహతహలాడుతున్నారు. ఒకప్పుడు ఓపెనర్‌గా ఆడిన పృథ్వీ షా (Prithvi Shaw) సైతం మెరుపు బ్యాటింగ్‌తో పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు. ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్న షాను పలకరించగా ‘భారత జట్టుకు ఆడకూడదని అనుకుంటారా. నేనే అంతే’ అని బదులిచ్చాడు.
ఫామ్‌లేమికి తోడు క్రమశిక్షణ కరువవ్వడంతో భారత జట్టుకు ఆపై రంజీలకు దూరమైన పృథ్వీ షా పునరాగమనంపై దృష్టి సారించాడు. ఐపీఎల్లో దంచేసి మళ్లీ టీమిండియా జెర్సీ ధరించాలనే పట్టుదలతో ఉన్నాడీ చిచ్చరపిడుగు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్న షా ఈసారి తనదైన ఆట చూపిస్తానని అంటున్నాడు. ‘పునరాగమనం గురించి ఆలోచించకుంటే నేను క్రికెట్ ఆడడంలో అర్ధమే లేదు. నేను మళ్లీ భారత జట్టుకు ఎంపికవ్వాలనే కసితోనే ఆడుతున్నా. ఎవరైనా ఇండియాకు ఆడకూడదని అనుకుంటారా? నేను అంతే. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. నిరుడు నేను నా జీవితాన్ని ఆస్వాదించాను.
🚨“200% EFFORT” – PRITHVI SHAW’S BIG COMEBACK STATEMENT🚨
– He said🎙️: I’m fully focused on making a comeback to Team India, & that’s why he is working harder than ever.🔥
He also admitted he has learned from his mistakes & believes improvementpic.twitter.com/7HqYKyRhcK
— Sam (@Cricsam01) March 25, 2026
మెదడును ప్రశాంతంగా ఉంచుకునేందుకు రెండు మూడు పర్యటనలకు వెళ్లా. ఆ తర్వాత మళ్లీ బ్యాట్ అందుకున్నా. ప్రాక్టీస్ మొదలెట్టాను. మునపటికంటే మూడింతలు ఎక్కువగా కష్టపడుతున్నా. అయితే.. గత రెండు సీజన్లు నేను గొప్పగా ఆడలేదు. ఓపెనర్‌గా నా నుంచి చాలా ఆశించారు. కానీ, నేను విఫలమయ్యాను. ఈసారి మాత్రం దూకుడుగా ఆడతాను’ అని పృథ్వీ షా వెల్లడించాడు. పద్దెనిమిదో సీజన్లో ఈ విధ్వంసక ఆటగాడిని ఎవరూ కొనలేదు. పంతొమ్మిదో సీజన్‌కు కూడా షాను తొలుత కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ కనీస ధర రూ.50 లక్షలకు అతడిని దక్కించుకుంది. పంతొమ్మిదో సీజన్ కోసం ట్రైనింగ్ సెషన్లో పాల్గొనే ముందు ‘కొన్ని కథలు ముగియవు. మళ్లీ మొదలవుతాయి. ఢిల్లీ.. మీ అబ్బాయి సొంతగూటికి వచ్చేశాడు’ అని పోస్ట్ పెట్టిన షా
🚨 PRITHVI SHAW RETURNS “HOME” TO DELHI 🚨
Prithvi Shaw said🎙️– “Some stories don’t end, they come back… Delhi, your boy is home.”
From going unsold to returning to Delhi Capitals, prithvi Shaw’s emotional comeback story hits different! 🤯 pic.twitter.com/spPEWZsDZi
— Sam (@Cricsam01) March 22, 2026
భారత జట్టుకు దూరమైనా.. దేశవాళీలో మెరుస్తున్న పృథ్వీ షా త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడు. కొన్ని రోజులుగా ఇన్ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal)తో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ డాషింగ్ బ్యాటర్ నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో మార్చి 8న (ఆదివారం) వీరిద్దరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది.